
మట్టి రవాణ వాహనాల పట్టివేత
● నలుగురిపై కేసు నమోదు
● ‘సాక్షి’కథనాలపై
అధికారుల్లో కదలిక
● అక్రమ మట్టి రవాణపై
అధికారుల నిఘా
వట్‌పల్లి(అందోల్): అక్రమ మట్టి మాఫియా వట్‌పల్లిలో అనుమతులు లేకుండా సాగిస్తున్న మట్టి దందాపై ‘సాక్షి’వరుస కథనాలు ప్రచురించడంతో అధికారులు మేల్కొన్నారు. మట్టి మాఫియాపై నిఘా పెట్టి అక్రమ రవాణ వాస్తవమేనని నిర్థారించుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు నేరుగా ఘటనా స్థలానికి వెళ్లారు. అక్కడ మట్టిని తవ్వుతున్న జేసీబీతోపాటు టిప్పర్, ట్రాక్టరుతో మరో మూడు వాహనాలను పట్టుకున్నారు. వాటిని స్వాధీనం చేసుకుని పోలీస్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఎస్సై లవకుమార్ శనివారం మీడియాకు వెల్లడించారు. అక్రమ మట్టి రవాణపై దృష్టి సారించామని, అనుమతులు లేకుండా మట్టి తరలిస్తే కేసులు నమోదు చేస్తామని తహసీల్దారు చంద్రశేఖర్ ‘సాక్షి’కి తెలిపారు. సెలవు రోజుల్లో కుడా పోలీసుల నిఘా ఉంచుతామన్నారు.

మట్టి రవాణ వాహనాల పట్టివేత