
పకడ్బందీగా నిమజ్జన ఏర్పాట్లు
జహీరాబాద్: వినాయక విగ్రహాల నిమజ్జనంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఎంపీ సురేశ్ షెట్కార్ అధికారులకు సూచించారు. జహీరాబాద్ పట్టణంలో ప్రతిష్ఠించిన వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం చేస్తున్న ఏర్పాట్లను ఆయన శనివారం పరిశీలించారు. మండలంలోని కొత్తూర్(బి) గ్రామ శివారులోని నారింజ ప్రాజెక్టును సందర్శించి సమీపంలో ఉన్న విద్యుత్ స్థంభాలకు విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయాలని, సీసీ కెమెరాలను సైతం ఏర్పాటు చేసి పర్యవేక్షించాలన్నారు. కార్యక్రమంలో మాజీమంత్రి ఎ.చంద్రశేఖర్, పార్టీ పార్లమెంట్ ఇన్‌చార్జి శుక్లవర్ధన్‌రెడ్డి, ఆయా మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హన్మంత్‌రావుపాటిల్, పి.నర్సింహారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, మక్సూద్, కండెం నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.
ఎంపీ సురేశ్ షెట్కార్