
హాస్టల్ విద్యార్థిని అదృశ్యం
నారాయణఖేడ్: విద్యార్థిని అదృశ్యమైంది. ఈ ఘటన మండలంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా... నారాయణఖేడ్‌లోని ఎస్సీ కళాశాల బాలికల హాస్టల్‌లో ఉంటూ వడ్డూరి సంధ్య (18) పట్టణంలోని నలంద వొకేషనల్ కళాశాలలో ఎంపీహెచ్‌డబ్ల్యూ చదువుతుంది. ఈనెల 22న కళాశాలకు వెళ్తున్నానని చెప్పి తిరిగి రాలేదు. హాస్టల్ వెల్ఫేర్ అధికారి రజిత పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్‌ఐ విద్యాచరణ్‌రెడ్డి కేసు నమోదు చేశారు.
చికిత్స కోసం వచ్చి..
సంగారెడ్డి క్రైమ్: చికిత్స నిమిత్తం పట్టణానికి వచ్చిన వృక్తి అదృశ్యమయ్యాడు. ఈ ఘటన పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ రమేశ్ వివరాల ప్రకారం... సదాశివపేట మండలం ఏటిగడ్డ సంగ్యం గ్రామానికి చెందిన మంగు పోచయ్య(48) ఫిట్స్‌తో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో చికిత్స కోసం సంగారెడ్డి మండలంలోని ఇర్గిపల్లి గ్రామానికి ఈ నెల 29న ఉదయం 10 గంటల సమయంలో ఇంటి నుంచి గ్రామా నికి వెళ్లాడు. తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
క్రీడాకారులకు సన్మానం
సిద్దిపేటజోన్: జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా జిల్లా నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులను శనివారం ఘనంగా సన్మానించారు. స్థానిక టీటీసీ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 2024–25 సంవత్సరానికి సంబంధించిన క్రీడాకారులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి, స్కూల్ అండ్ గేమ్స్ ఫెడరేషన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి సౌందర్య, తదితరులు పాల్గొన్నారు.

హాస్టల్ విద్యార్థిని అదృశ్యం