
మోదుగు ఆకులతో వినాయకుడు
తీర్చిదిద్దిన ఫార్మసీ గ్రాడ్యుయేట్
వర్గల్(గజ్వేల్): పర్యావరణానికి చేటు చేసే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గణపతులు వద్దు.. పర్యావరణ హిత గణపతులే మేలు అంటున్నాడు వర్గల్‌కు చెందిన ఫార్మసీ గ్రాడ్యుయేట్ అయ్యగల్ల దయాకర్. ప్రతి యేటా పర్యావరణ హిత గణపతిని తానే తయారు చేసి పూజిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఈసారి మోదుగాకులతో గణపతిని కళాత్మకంగా తీర్చిదిద్దా డు. సంకల్పం ఉంటే సాధ్యం కానిది లేదన్నట్లు నాలుగేళ్ల క్రితం 2021లో మట్టి వినాయకుడిని, 2022లో వినూత్నంగా కాగితాలతో, 2023లో గోనెసంచులతో (గన్నీ బ్యాగ్) గణేశుడిని తయారు చేసి కళాత్మకంగా తీర్చిదిద్దాడు. తన ఇంట్లో ప్రతి ష్ఠించుకొని పూజలు చేశాడు. గత సంవత్సరం అమ్మమ్మ మృతితో నవరాత్రోత్సవాలు జరుపుకోలే దు. తాజాగా వినూత్న రీతిలో మోదుగ ఆకులు వినియోగించి 7 అడుగుల గణపతిని తయారు చేశాడు. సమాజంలో మార్పే లక్ష్యంగా పర్యావరణహిత వస్తువులతో వినాయకుడిని తయారుచేస్తూ ప్రచారం చేస్తున్నట్లు దయాకర్ పేర్కొ న్నాడు. ఆ యువకుడిని గజ్వేల్ శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యక్షుడు రామకోటి రామ రాజు అభినందిస్తూ జ్ఞాపిక అందజేసి సన్మానించాడు.