
కదం తొక్కిన కార్మికులు
సంగారెడ్డి ఎడ్యుకేషన్: కార్మిక హక్కుల కోసం కాంట్రాక్ట్ కార్మికులు సంగారెడ్డిలో కదం తొక్కారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కాంటాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ 26 వేలు చెల్లించాలని, చట్ట బద్ధమైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సంగారెడ్డిలో కాంట్రాక్ట్ కార్మికులు తమ హక్కుల కోసం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ వరకు ర్యాలీగా వచ్చిన కార్మికులు లోపలికి వెళ్లేందుకు గేట్లు ఎక్కారు. కార్మికుల సమస్యలపై స్పందించాలని నినాదాలు చేయడంతో కలెక్టరేట్ ఏవో,కార్మిక శాఖ ఏఎల్‌ఓ అధికారులు బయటకు వచ్చి వినతిపత్రం తీసుకున్నారు. అనంతరం సీఐటీయూ కాంట్రాక్ట్ వర్కర్స్‌యూనియన్ జిల్లా అధ్యక్షుడు మాణిక్యం మాట్లాడుతూ... నిత్యవసర సరుకుల ధరలు పెరుగుతున్నా కార్మికుల కనీస వేతనాలు మాత్రం పెరగడం లేదన్నారు. కార్మికుల పట్ల నిర్లక్ష్యం తగదని ప్రభుత్వాలను హెచ్చరించారు. 15 ఏళ్లకుపైగా కనీస వేతనాలను సవరించకపోవడం దారుణమన్నారు. అర్హులైన కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి సాయిలు, రాష్ట్ర కమిటీ సభ్యుడు రాజయ్య, జిల్లా సహాయ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్ గేట్లు ఎక్కి ఆందోళన
సీఐటీయూ కాంట్రాక్ట్ వర్కర్స్
యూనియన్ జిల్లా అధ్యక్షుడు మాణిక్యం