సంగారెడ్డి ఎడ్యుకేషన్/సదాశివపేట(సంగారెడ్డి): భూములు కోల్పోయిన రైతులకు అండగా ఉంటానని ఎంపీ రఘునందన్‌రావు స్పష్టం చేశారు. భూమిని కోల్పోయిన రైతులకు న్యాయం చేయాలని కోరుతూ సంగారెడ్డి బీజేపీ నాయకులు శుక్రవారం రఘునందన్‌రావును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రఘునందన్‌రావు భూములు కోల్పోయిన రైతులకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ...గతంలో ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి తొగర్‌పల్లి రైతుల దగ్గర భూమిని తీసుకుందన్నారు. ఆ రైతులకు పరిహారంతోపాటు ఇళ్ల స్థలాలు కూడా ఇస్తామని చెప్పి పదేళ్లు గడిచినా నేటికీ ఇవ్వలేదని చెప్పారు. కొన్ని రోజుల క్రితం వచ్చి కార్పొరేట్ సంస్థకు మాత్రం ప్రభుత్వం వెంటనే భూమిని మంజూరు చేసిందని గుర్తు చేశారు. ప్రభుత్వం స్పందించి త్వరలోనే రైతులందరికీ ఇళ్ల స్థలాలిచ్చి న్యాయం చేయాలని లేదంటే రైతులందరితో కలిసి ధర్నా నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇళ్ల స్థలం ఇప్పించేవరకు రైతులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీనిచ్చారు. వినతిపత్రం అందించిన వారిలో బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, సీనియర్ నాయకులు మల్లేశం, మండల ప్రధాన కార్యదర్శి శివ, నాయకులు కిషన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలి
చదువుకున్న యువత ఉద్యోగం కోసం ఎదురుచూడకుండా మరో పదిమందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని ఎంపీ రఘునందన్‌రావు పేర్కొన్నారు. పట్టణంలోని సుభాష్‌రోడ్డులో నూతన సాయిగణేశ్‌వస్త్రషాపింగ్ మాల్‌ను ఆయన ప్రారంభించారు.
ఎంపీ రఘునందన్‌రావు