
పరిహారం అందేలా కృషి చేస్తా
నారాయణఖేడ్: వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన బాధితులకు ప్రభుత్వం నుంచి ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే సంజీవరెడ్డి తెలిపారు. నాగల్‌గిద్ద మండలం గౌడ్‌గాం జన్‌వాడ, మంజీరా నది పరీవాహకంగా గ్రామాల వ్యవసాయ క్షేత్రాలను ఎమ్మెల్యే సంజీవరెడ్డి శుక్రవారం పర్యటించి పరిశీలించారు. రైతులు, గ్రామాల ప్రజల పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఖేడ్‌లోని శాఖా గ్రంథాలయాన్ని సందర్శించి పాఠకులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...అధికారులు జరిగిన పంటలు, ఆస్తుల నష్టంను అంచనా వేసి ప్రభుత్వానికి వెంటనే నివేదిక పంపించాలని సూచించారు. మనూరు మండలంలోని కమలాపూర్ చెరువు పరిశీలించి చెరువు వద్ద చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు ఆదేశించారు. చెరువు దుస్థితిని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకు వచ్చారు.
రెస్క్యూటీం సేవలు సద్వినియోగం చేసుకోండి
వర్షాల నేపథ్యంలో సహాయంకోసం టోల్ ఫ్రీ నంబరు 101కు లేదా అగ్నిమాపక కేంద్రానికి సంబంధించి 8712699393, 8712699392 నంబర్లలో సంప్రదించాలన్నారు.
రాకపోకల పునరుద్ధరణ
నారాయణఖేడ్: ఖేడ్– సిర్గాపూర్ మార్గంలో ఖేడ్ మండలంలోని చల్లగిద్ద తండా వద్ద రోడ్డు వర్షాలకు కోతకు గురవ్వడంతో కామారెడ్డి జిల్లాకు రాకపోకలు నిలిచిపోయాయి. మరమ్మతులు చేపట్టాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఆదేశించడంతో శుక్రవారం ఉదయం జేసీబీతో మరమ్మతు పనులు చేపట్టి సాయంత్రానికి పూర్తి చేశారు. దీంతో రాకపోకలు పునఃప్రారంభమయ్యాయి.
ఎమ్మెల్యే సంజీవరెడ్డి