జహీరాబాద్/జహీరాబాద్ టౌన్: వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కె.మాణిక్‌రావు, రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ ఎన్.గిరిధర్‌రెడ్డి ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. శుక్రవారం మండలంలోని కొత్తూర్(బి) గ్రామ శివారులోని నారింజ ప్రాజెక్టును వారు అధికారులతో కలిసి సందర్శించారు. నారింజ వద్ద నిమజ్జనం కోసం చేయాల్సిన ఏర్పాట్లను అధికారులకు వివరించారు. ప్రాజెక్టు వరకు ఉన్న రోడ్లను పరిశీలించారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా దెబ్బతిన్న రోడ్లను మరమ్మతులు చేయాలని ఆదేశించారు. అంతకుముందు పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే కె.మాణిక్‌రావు ఝరాసంగం మండలంలోని బొప్పన్‌పల్లికి చెందిన సిద్దప్పకు రూ.15 వేల సీఎం సహాయ నిధి చెక్కును అందజేశారు. జహీరాబాద్ పట్టణంలోని అతిథిలో ప్రతిష్ఠించిన వినాయక విగ్రహాన్ని గురువారం రాత్రి ఎమ్మెల్యే మాణిక్‌రావు, డీసీఎంఎస్ చైర్మన్ ఎం.శివకుమార్ సందర్శించి ప్రత్యేకపూజలు నిర్వహించారు.
ఎమ్మెల్యే మాణిక్‌రావు