
మార్కండేయ ఆలయాభివృద్ధికి కృషి
సదాశివపేట(సంగారెడ్డి): ఈశ్వర మార్కండేయ ఆలయాభివృద్ధికి తన వంతు పూర్తి సహాయ సహకారం అందిస్తానని టీజీఐఐసీ చైర్మన్ నిర్మలారెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని ఈశ్వర మార్కండేయ ఆలయ నూతన పాలక మండలి ప్రమాణస్వీకార మహోత్సవానికి శుక్రవారం ఆమె హాజరై మాట్లాడారు. మార్కండేయ మందిరంలో నిర్మలారెడ్డితోపాటు నూతన పాలకమండలి చైర్మన్, సభ్యులు ప్రత్యేక పూజలు చేసి మార్కండేయ స్వామిని దర్శించుకున్నారు. ఆలయ ఆవరణలో దేవాదాయ శాఖ ఈఓ రామారావు నూతన పాలకమండలి చైర్మన్‌గా వెంకన్న, డైరెక్టర్లుగా సి.మాణిక్యం, ఎం.రామకృష్ణ, కె.హరికృష్ణ, ఎం.అనితతో ప్రమాణ స్వీకారం చేయించారు.
టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలారెడ్డి