
డెంగీతో బాలుడు మృతి
జగదేవ్‌పూర్(గజ్వేల్): తీవ్ర జ్వరంతో బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని అనంతసాగర్‌లో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన బొనగిరి కిష్టయ్య, రూప దంపతులకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు యశ్వంత్(10) కుకునూర్‌పల్లిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. నాలుగు రోజుల నుంచి అతడు జ్వరంతో బాధపడుతున్నాడు. దీంతో అక్కడే ప్రైవేట్ ఆస్పత్రిలో చూపించారు. జ్వరం తగ్గకపోవడంతో గురువారం గజ్వేల్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షలు నిర్వహించి డెంగీ లక్షణాలు ఉన్నట్లు నిర్ధారించారు. వైద్యుల సూచనల మేరకు హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. కాగా గ్రామంలో 15 మంది విష జ్వరాల బారిన పడ్డారు. విషయం తెలుసుకున్న డిప్యూటీ డీఎంహెచ్‌ఓ శ్రీనివాస్ గ్రామానికి చేరుకుని బాలుడి కుటుంబాన్ని పరామర్శించారు.