
తగ్గని వరద.. వీడని వాన
కూలిన ఇల్లు
నీట మునిగిన పంటను పరిశీలిస్తున్న రైతులు
పాపన్నపేట(మెదక్): వర్షాలతో మంజీరాలోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. ఘనపురం ఆనకట్ట నుంచి శుక్రవారం 59,800 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుంది. దీంతో ఏడుపాయల వన దుర్గమ్మ ఆలయం జల దిగ్బంధంలోనే ఉంది. 16 రోజులుగా అమ్మవారి ఆలయం భక్తులు వెళ్లడానికి వీలు లేకపోవడంతో, రాజగోపురంలో ఉత్సవ విగ్రహాన్ని ఉంచి పూజలు చేస్తున్నారు. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో మండలంలోని 2450 ఎకరాల వరి పంట నీట మునిగింది. 2935 రైతులు పంటను కోల్పోయారు. అలాగే మండలంలో 29 ఇళ్లు కూలిపోయాయి. ఎల్లాపూర్ బ్రిడ్జిపై, భారాఖానల వద్ద మంజీరా నీటి‘ప్రవాహం తగ్గడంతో, ముందుకు వెళ్లేందుకు పోలీసులు అనుమతించారు. దీంతో మండల వాసులు మెదక్ వెళ్లడానికి మార్గం సుగమం అయ్యింది. ఎమ్మార్వో సతీశ్ ఆధ్వర్యంలో రెవెన్యు సిబ్బంది, రాజ్యాతండా రోడ్డు, కూలిన ఇళ్లను పరిశీలించారు. మండలంలో సుమారు 29 ఇళ్లు కూలిపోయినట్లు తెలిపారు. వ్యవసాయ అధికారి నాగమాధురి మండలంలోని పలు గ్రామాల్లో నీట మునిగిన పంటలను పరిశీలించారు. ముఖ్యంగా మంజీరా తీర ప్రాంతాల్లో పంట ఎక్కువగా మునిగినట్లు తెలిపారు.
జలదిగ్బంధంలోనే వన దుర్గమ్మ
ఎల్లాపూర్.. భారాఖాన వద్ద రాకపోకలకు సుగమం
మండలంలో 2450 ఎకరాల్లో పంట నష్టం
కూలిన 29 ఇళ్లు

తగ్గని వరద.. వీడని వాన