
పొలానికి వెళ్లాలంటే తిప్పలే..
● 14 కి.మీటర్లు తిరిగి వెళ్లాల్సిందే
● భాగీర్థిపల్లిలో బ్రిడ్జి లేకపోవడంతో రైతుల కు ఇబ్బందులు
చిన్నశంకరంపేట(మెదక్): వాగు ఉధృతంగా ప్రవహించడంతో పంట పొలాలు నీటమునిగాయి. మండలంలోని భాగీర్థిపల్లిలో శుక్రవారం గ్రామ రైతులు వాగు అవతల ఉన్న పంట పొలాలకు వెళ్లలేకపోతున్నామని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ వాగును దాటలేని పరిస్థితి ఉందని, దీంతో చిన్నశంకరంపేట మీదుగా గవ్వలపల్లి నుంచి జంగరాయి తండా మీదుగా పంట పొలాలకు సుమారు 14 కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సి వస్తుంద న్నారు. వర్షాలకు పైన ఉన్న చిన్నశంకరంపేట, గవ్వలపల్లి, జంగరాయి, సూరారం గ్రామాల చెరువులు అలుగుపారడంతో బంద్ అయ్యే వరకు తిప్పలు తప్పడం లేదని వాపోతున్నారు. తాము పంట పొలాలకు వెళ్లేలా బ్రిడ్జి నిర్మాణం కోసం అధికారులు సహకరించాలని రైతులు కోరుతున్నారు.