
గడువు తీరిన బీరు విక్రయం
తాగిన వ్యక్తికి అస్వస్థత
దుబ్బాకటౌన్: గడువు తీరిన బీరు తాగిన వ్యక్తి అస్వస్థతకు గురయ్యాడు. ఈ ఘటన దుబ్బాక పట్టణంలో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. కాగా శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా... దుబ్బాకకు చెందిన ఒక వ్యక్తి అంగడి బజార్‌లోని ఓ వైన్ షాపులో 2 బీర్లను కొనుగోలు చేసి ఇంటికి తీసుకువెళ్లి ఒకటి తాగడంతో కడుపు వికారంగా మారి, కండ్లు ఎర్రబడ్డాయి. దీంతో మద్యం సీసాలను తనిఖీ చేయగా దానిపై ఉన్న గడువు తేదీ ఈ నెల 13వ తేదీతోనే ముగిసింది. దీంతో వెంటనే బాధితుడు మద్యం దుకాణం యజమానిని నిలదీశాడు. వెంటనే యజమాని బాధితుడికి ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేయించాడు. అనంతరం బాధితుడు మెరుగైన చికిత్స కోసం సిద్దిపేట జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాడు. ప్రస్తుతం బాధితుడు అనారోగ్యం నుంచి కోలుకుంటున్నాడు. ఎకై ్సజ్ సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సిబ్బంది దుబ్బాకలోని గడువు తీరిన మద్యం అమ్మిన దుకాణంలో తనిఖీ చేశారు. అలాగే పట్టణంలోని 4 మద్యం దుకాణాలను తనిఖీ చేసి, ఆ దుకాణాలపై టెక్నికల్ కేసులు నమోదైనట్లు ఎకై ్సజ్ సీఐ శ్రీనివాస్ తెలిపారు.