
పర్యవేక్షిస్తున్న ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు
జిల్లాలో సహాయకచర్యల ను ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. వరద ప్రాంతాల్లో మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే సంజీవరెడ్డి పర్యటించి బాధితులకు అండగా ఉంటామని హామీనిచ్చారు. రాసోల్ గ్రామానికి వెళ్లే స్వాములవాగు వంతెన వద్ద నీటి ప్రవాహాన్ని ఎమ్మెల్యే సంజీవరెడ్డి పరిశీలించారు. జహీరాబాద్ పట్టణంలోని వరద ముంపునకు గురైన కాలనీలను, నారింజ ప్రాజెక్టును ఎమ్మెల్యే కె.మాణిక్‌రావు సందర్శించారు. కల్హేర్–పిట్లం మధ్యలో మహరాజ్ వాగు, మీర్ఖాన్‌పేట్ వద్ద ప్రవహిస్తున్న వాగును ఖేడ్ మండలం కాంజీపూర్, మాద్వార్ వంతెనలతోపాటు నిజాంపేట్ మండలం శాకాపూర్ చెరువు ఉధృతిని, జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్, సబ్‌కలెక్టర్ ఉమాహారతి, డీఎస్పీ వెంకట్‌రెడ్డి, సీఐ శ్రీనివాస్‌రెడ్డి పరిశీలించారు.