
లేఖారచనలో జాతీయస్థాయి విజేతగా రిబ్క
సిద్దిపేటఎడ్యుకేషన్: ‘యువత సామాజిక మాధ్యమాల ప్రభావం’అనే అంశంపై నిర్వహించిన జాతీయస్థాయి లేఖారచన పోటీలలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థిని తిప్పనబోయిన రిబ్క విజేతగా నిలిచింది. ఈ సందర్భంగా గురువారం ఆమెను కళాశాలలో ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత, వైస్ ప్రిన్సిపాల్ అయోధ్యారెడ్డి తదితరులు అభినందించారు. ఈ సందర్భంగా తెలుగుశాఖ, భాషాసాంస్కృతిక విభాగం అధ్యక్షుడు డాక్టర్ మట్టా సంపత్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ వ్యావహారిక భాషోద్యమకారుడు గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని తాడేపల్లిగూడెం డీఆర్జీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ పోటీలు జరిగాయన్నారు. విద్యార్థిని రిబ్బ త్వరలో నగదు పురస్కారం, జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందుకోనున్నట్టు చె ప్పారు. కార్యక్రమంలో తెలుగువిభాగం అధ్యాపకుడు పిట్లదాసు, వెంకటరమణ, శైలజ, సాయిసురేశ్, నరేశ్, రామస్వామి పాల్గొన్నారు.
దౌల్తాబాద్(దుబ్బాక): మండల పరిధిలోని శేరిపల్లి ప్రాథమిక పాఠశాలకు రాష్ట్రస్థాయి గుర్తింపు లభించింది. ఆ పాఠశాల హెచ్‌ఎం వెంకట్‌రెడ్డి గురువారం విలేకరులకు తెలిపారు. ‘తల్లి దండ్రులను సులభంగా పాల్గొనేలా చేయొచ్చు’అనే అంశంపై పాఠశాల ఉపాధ్యాయుడు బి.రవి రాసిన కథనాన్ని రాష్ట్ర విద్యాశాఖ ఎస్‌సీఈఆర్‌టీ ప్రచురించిన ‘ట్రైల్ బ్లేజర్స్’అనే పుస్తకంలో ప్రచురించారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ తోటి ఉపాధ్యాయులు విష్ణువర్ధన్‌రెడ్డి, శ్రీనివాస్, షెహనా బేగంతోపాటు విద్యార్థుల తల్లిదండ్రులు, దాతల సహకారం పాఠశాలలో నిర్వహించిన వినూత్న కార్యక్రమాలే పాఠశాలకు రాష్ట్రస్థాయి గుర్తింపు రావడానికి తోడ్పడ్డాయన్నారు.
ఇసుక లారీ సీజ్
చిన్నకోడూరు(సిద్దిపేట): అనుమతులు లేకుండా అక్రమంగా రవాణా చేస్తున్న ఇసుక లారీని సీజ్ చేసినట్లు ఎస్‌ఐ సైఫ్ అలీ తెలిపారు. రాజీవ్ రహదారిపై చర్లఅంకిరెడ్డిపల్లి సమీపంలో గురువారం తెల్లవారుజామున పోలీసులు తనిఖీలు చేపట్టారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీని పట్టుకుని డ్రైవర్ శ్రీనివాస్‌ను విచారించారు. కరీంనగర్ జిల్లాలోని మోయతుమ్మెద వాగు నుంచి ఇసుకను హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు తేలింది. దీంతో లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి, ఇసుక లారీని సీజ్ చేసినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.
సదాశివపేటరూరల్(సంగారెడ్డి): విద్యుదాఘాతానికి గురై రెండు ఆవులు మృతి చెందాడు. ఈ ఘటన మండలంలో ఆరూర్లో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పెద్దగొల్ల రాములు రోజులాగానే శివారులో ఆవులను మేతకు వదిలాడు. ఈ క్రమంలో అవి మేత మేస్తూ అక్కడ వేలాడుతున్న విద్యుత్ వైర్లను తాకాయి. దీంతో అక్కడికక్కడే మృతి చెందాయి. ఆవుల విలువ రూ.1.40 లక్షలు ఉంటు ందని, ప్రభుత్వం తనను ఆదుకోవాలని రైతు వేడుకున్నాడు. విషయం తెలుసుకున్న వెటర్న రీ అధికారులు పంచనామా నిర్వహించారు.
ఐదుగురికి గాయాలు
వట్‌పల్లి(అందోల్): అందోల్ మండల పరిధిలోని కన్‌సాన్‌పల్లిలో పిచ్చి కుక్క వీర విహారం చేసింది. ఐదుగురికి కరవడంతో తీవ్ర గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన సంతోష, ఎలీషా, కార్తీక్, దస్తగీర్, ప్రశాంత్‌లపై కుక్క దాడి చేసింది. గాయాలైన వీరిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే గ్రామంలో కుక్కల సంచారం పెరిగిందని, అధికారులు స్పందించి కుక్కల బెడదను నివారించాలని స్థానికులు కోరుతున్నారు.
సిద్దిపేటజోన్: మున్సిపల్‌కు చెందిన అధికారిపై ఉన్నతాధికారులు శాఖాపరమైన చర్యలు చేపట్టారు. సిద్దిపేట మున్సిపాలిటీలో యూడిఆర్‌ఐగా పనిచేస్తున్న బాలకృష్ణ తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించి పదోన్నతి పొందినట్టు వి చారణలో తేలింది. ఈ మేరకు బాలకృష్ణను తిరి గి జూనియర్ అసిస్టెంట్‌గా డిమోషన్ చేసి తూప్రాన్ మున్సిపాలిటీకి బదిలీ చేస్తూ వరంగల్ రీజినల్ డైరెక్టర్ షాహిద్ మసూద్ ఉత్తర్వులు జారీ చేశారు. విషయాన్ని గురువారం మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్ ధ్రువీకరించారు.

లేఖారచనలో జాతీయస్థాయి విజేతగా రిబ్క

లేఖారచనలో జాతీయస్థాయి విజేతగా రిబ్క

లేఖారచనలో జాతీయస్థాయి విజేతగా రిబ్క