
వేర్వేరు చోట్ల నలుగురు అదృశ్యం
ఉమ్మడి జిల్లాలో వేర్వేరు చోట్ల నలుగురు అదృశ్యమయ్యారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
భార్యకూతురు..
పటాన్‌చెరు టౌన్: భార్య,కూతురు అదృశ్యమైన సంఘటన పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ముత్తంగికి చెందిన రమేష్ చెత్త బండి నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే రమేష్ భార్య సంగీతకు ఇటీవల ఆపరేషన్ కావడంతో గుల్బర్గాలో ఉండే తల్లిగారి ఇంటికి కూతురు నమనీ(2)ని తీసుకొని వెళ్లింది. తిరిగి ఈనెల 20న తిరిగి ముత్తంగి ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో ఈనెల 24న రమేష్ పనికి వెళ్లి తిరిగి మధ్యాహ్నం ఇంటికి వచ్చేసరికి భార్య సంగీత, కూతురు నమనీ కనిపించలేదు. రమేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
భర్త...
బెజ్జంకి(సిద్దిపేట): మండలంలోని గాగిళ్లాపూర్‌కు చెందిన రాగి రాజేశం(45) అదృశ్యమైనట్లు ఎస్‌ఐ సౌజన్య తెలిపారు. ఈ నెల 27న తెల్లవారుజామున ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో రాజేశం కుమారుడు అజయ్ ఫిర్యాదు మేరకు మిిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సౌజన్య తెలిపారు. కాగా, రాజేశం మద్యం తాగే విషయంలో భార్యతో ఘర్షణ చోటుచేసుకుందని, ఇంట్లో నుంచి వెళ్లే సమయంలో పసుపు చొక్కా వేసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
వ్యక్తి...
పటాన్‌చెరు టౌన్: ఇంటి నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఈ సంఘటన పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండలం పరిధి రామేశ్వరంబండకు చెందిన సాయిలు ఈ నెల 26న భార్య స్వప్నతో గొడవపడి ఇంటి నుంచి బయటకు వెళ్లిన తిరిగి రాలేదు. దీంతో భర్త కోసం తెలిసిన వారి వద్ద, స్థానికంగా వెతికిన ఆచూకీ లభించలేదు. కేసు దర్యాప్తులో ఉంది.

వేర్వేరు చోట్ల నలుగురు అదృశ్యం

వేర్వేరు చోట్ల నలుగురు అదృశ్యం