
తెలుగుభాషపై ఉన్న పట్టు ఇతర భాషలపై ఉండదు
ఎన్ని భాషలు నేర్చుకున్న మన తెలుగుభాష మీద ఉన్న ప్రావీణ్యం ఎందులో ఉండదు. తెలుగుభాషపై ఉన్న పట్టు ఇతర భాషలపై ఉండదు. రాష్ట్రంలోనే సిద్దిపేటకు ప్రత్యేక స్థానం ఉంది. అన్ని రంగాల్లో ముందు ఉన్న సిద్దిపేట తెలుగుభాష అభివృద్ధిలోను ముందుంటుంది. జిల్లాలో అనేక సంఘాలు, సంస్థలు ఈ తెలుగుభాష అభివృద్ధికి కృషి చేస్తున్నాయి.
–కథల తాతయ్య ఎన్నవెళ్లి రాజమౌళి, ప్రముఖ కవి, సిద్దిపేట
తెలుగు భాషను
మించినది లేదు
కన్నతల్లి ప్రేమ, పుట్టి పెరిగిన ఊరు, తెలుగుభాషపై మమకారం తీరనిది. ఎన్ని భాషలు వచ్చిన, ఎన్ని ప్రాంతాలకు వెళ్లిన మన ప్రాంతం, మన తెలుగు భాషపై పట్టు ఉంటుంది. చిన్న పిల్లలు కూడా తమ అభిప్రాయాలను కేవలం తెలుగుభాషలో మాత్రమే వ్యక్తం చేస్తారు. జిల్లాలో తెలుగు సభలు, సమావేశాలు, కవి సమ్మేళనాలతో నిత్యం తెలుగుభాష పరిరక్షణకు అందరం తోడ్పాడుతున్నాం.
–ఉండ్రాళ్ల రాజేశం,
బాలసాహితీవేత్త, సిద్దిపేట

తెలుగుభాషపై ఉన్న పట్టు ఇతర భాషలపై ఉండదు