
గణపతి ఆకారంలో విద్యార్థులు
నారాయణఖేడ్: వినాయక చవితి పండుగను పురస్కరించుకుని ఖేడ్‌లోని నియోప్రగతి పాఠశాల విద్యార్థులు వినాయక ఆకారంలో కూర్చొని ప్రదర్శన చేశారు. వినాయక ప్రతిమ తరహాలో వారి ఆకృతి చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సందర్భంగా పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను విద్యార్థులు నిర్వహించారు.
నారాయణఖేడ్: వినాయ చవితి పండుగను పురస్కరించుకుని ‘వాసవీ మా ఇల్లు’స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో ఖేడ్ సబ్ కలెక్టర్ ఉమాహారతి గణపతి మట్టి విగ్రహాలను మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఉమాహారతి మాట్లాడుతూ...ఖేడ్‌లో సైతం ఈ సంస్థ వారు మట్టి ప్రతిమలను అందించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు తోపాజీ అనంతకిషన్ గుప్తా, ప్రధాన కార్యదర్శి పుల్లూరు ప్రకాశ్ తహసీల్దారు హసీనాబేగం రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
జహీరాబాద్ టౌన్: జహీరాబాద్ ప్రాంతంలో విద్యాభివృద్ధికి జార్జ్ బి గార్డెన్ దొర అందించిన సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే కె.మాణిక్‌రావు కొనియాడారు. గార్డెన్ దొర 33వ వర్ధంతి సందర్భంగా మంగళవారం ఎంఆర్‌హెచ్‌ఎస్ స్కూల్ ఆవరణలో ఉన్న ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..అమెరికాకు చెందిన జార్జ్ బి గార్డెన్ దొర దంపతులు వెనుకబడిన జహీరాబాద్ ప్రాంతానికి వచ్చి విద్యాప్రమాణాలను పెంచారన్నారు. ఈయన సేవల వల్ల ఎంతోమంది విద్యావంతులయ్యారని, గొప్ప గొప్ప పదవుల్లో ఉన్నారని చెప్పారు. కార్యక్రమంలో గార్డెన్ దొర కమిటీ సభ్యులు, క్రైస్తవ సంఘ నాయకులు, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు తట్టునారాయణ తదితరులు పాల్గొన్నారు.
సంగారెడ్డి టౌన్: మద్యం దుకాణాల టెండర్లలో కల్లు గీత కార్మికులకు 25% కేటాయించాలని ఆ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఆశన్నగౌడ్ డిమాండ్ చేశారు. సంగారెడ్డి పట్టణంలో కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. మద్యం దుకాణాల టెండర్ల వల్ల గీత కార్మికుల ఉపాధి కోల్పోతున్నారని 15% రిజర్వేషన్ జీవో నంబర్ 93ను సవరించి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 25% పెంచి కల్లుగీత సొసైటీలకు అందజేయాలని కోరారు.
నానో యూరియాతో పర్యావరణానికి మేలు
జిల్లా వ్యవసాయాధికారి శివప్రసాద్
సంగారెడ్డి: నానో యూరియాతో పర్యావరణానికి మేలలని జిల్లా వ్యవసాయాధికారి శివప్రసాద్ పేర్కొన్నారు. చౌటాకూర్ మండల కేంద్రంలో ఇఫ్కో ఆధ్వర్యంలో రైతులకు యూరియా పిచికారీపై మంగళవారం నిర్వహించిన అవగాహన సదస్సు శివప్రసాద్ హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా సరిపడా యూరియాను అందించకుండా అవగాహన సదస్సులు నిర్వహించడమేంటని రైతులు నిలదీశారు. సబ్సిడీ కింద డ్రోన్‌లను అందించాలని రైతులు విజ్ఞప్తి చేశారు.

గణపతి ఆకారంలో విద్యార్థులు

గణపతి ఆకారంలో విద్యార్థులు