
సబ్సిడీపై సాగు పరికరాలు
సంగారెడ్డి జోన్: వ్యవసాయంలో యాంత్రీకరణను ప్రోత్సహించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టిన సబ్ మిషన్ ఆన్ అగ్రికల్చరల్ మెకనైజేషన్(స్మామ్)పథకానికి రైతుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ పథకంలో భాగంగా జిల్లా రైతులకు 7,832 యంత్రాలను అందించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే రూ.6.58 కోట్లు కేటాయించగా మొదటి విడతలో రూ.2.23కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. కాగా, ఆసక్తి ఉన్న రైతులకు యంత్ర పరికరాలు పొందేందుకు వ్యవసాయాధికారులకు నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్ జిరాక్స్‌తోపాటు రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలను జతచేయాలి.
కమిటీల ద్వారా లబ్ధిదారుల ఎంపిక
ఎంపిక కమిటీల ద్వారా ఈ పథకానికి అర్హులను గుర్తించనున్నారు. యూనిట్ విలువ రూ.లక్షలోపు ఉంటే మండల వ్యవసాయాధికారి, ఎంపీడీఓ, తహసీల్దార్ కలిసి అర్హులను ఎంపిక చేస్తారు. రూ.లక్ష కంటే ఎక్కువగా ఉంటే కలెక్టర్, జిల్లా వ్యవసాయాధికారి, రీజనల్ మేనేజర్, లీడ్ బ్యాంకు మేనేజర్, హార్టికల్చర్ జిల్లా అధికారి కలిసి ఎంపిక చేయనున్నారు. ఎంపిక కమిటీ చైర్మన్‌గా కలెక్టర్, కన్వీనర్‌గా డీఏఓ, ఇతర అధికారులు సభ్యులుగా వ్యవహరించనున్నారు. కాగా, చిన్న, సన్నకారు రైతులతోపాటు ఎస్సీ, ఎస్టీ మహిళా రైతులకు 50%, మిగతా రైతులకు 40% రాయితీపై యంత్రపరికాలను అందించనున్నారు.
జిల్లాకు కేటాయించిన సబ్సిడీ పరికరాలు ఇవీ
యంత్రం పేరు మంజూరైనవి
బ్యాటరీ, చేతి, మాన్యువల్ స్ప్రేయర్లు 5,871
పవర్ నాప్‌సాక్ స్ప్రేయర్లు 784
రొటోవేటర్లు 292
విత్తన, ఫర్ట్టిలైజర్ వేసే యంత్రాలు (గొర్రు) 71
ట్రాక్టర్ పరికరాలు (వ్యవసాయం అనుబంధం) 479
బండ్ ఫార్మర్లు 9
గడ్డి కత్తిరించే యంత్రాలు 83
బ్రష్ కట్టర్లు 83
కలుపు తీతయంత్రాలు 83
మెయిజ్ షెల్లర్ష్ (మొక్కజొన్న రాశి యంత్రం) 39
స్ట్రాబాలెర్స్ (గడ్డి మోపులు కట్టే యంత్రం) 38
రైతుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
అర్హుల ఎంపికకు కమిటీలు
జిల్లాకు 7,832 యంత్రాలు మంజూరు