
శాంపిల్స్ ల్యాబ్‌కు పంపించాం
మధుప్రియ డెయిరీ ఫామ్ నెయ్యి శాంపిల్‌ను ల్యాబ్‌కు పంపించాం. రిపోర్ట్ ఆధారంగా తదుపరి చర్యలుంటాయి. ప్రస్తుతానికి అనుమతులు లేకుండా నెయ్యి తయారు చేస్తుండటంపై యజమాని బొమ్మ రాఘవేందర్‌తో పాటు అందులో పని చేసే కార్మికులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆహార పదార్థాల తయారీపై ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నాం. ఏ పదార్థమైనా కల్తీవి తయారు చేస్తే ఈ నంబర్ 99856 00602కు సమాచారం అందించండి. – రాజేశ్వర్, ఫుడ్ ఇన్‌స్పెక్టర్, సంగారెడ్డి జిల్లా
కల్తీ పదార్థాలు తింటే అనారోగ్యమే..
కల్తీ పాలు, నెయ్యి తినడం వల్ల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. కడుపునొప్పి, విరేచనాలు, వాంతులు, జీర్ణ సమస్యలు, దీర్ఘకాలంలో కాలేయం, మూత్రపిండాలు, గుండైపె ప్రభావం చూపే అవకాశం ఉంది. దీర్ఘకాలం కల్తీ ఆహారం తీసుకుంటే కేన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. పిల్లలకు రక్తహీనత, ఎముకల బలహీనత, రోగనిరోధక శక్తి తగ్గుతుంది.
– డాక్టర్ రజిని, పీహెచ్‌సీ వైద్యురాలు

శాంపిల్స్ ల్యాబ్‌కు పంపించాం