
గల్లంతైన మహిళ కోసం గాలింపు
కొల్చారం(నర్సాపూర్): ఈనెల 17న మండలంలోని తుక్కాపూర్ గ్రామానికి చెందిన ప్రమీల కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లి మంజీరా నదిలో గల్లంతైన విషయం తెలిసిందే. కలెక్టర్ ఆదేశాలతో ఆదివారం ఎస్డీఆర్‌ఎఫ్, జిల్లా ఫైర్ అధికారి వేణు ఆధ్వర్యంలో నదీ తీరం వెంట గాలింపు చర్యలు చేపట్టారు. బైనాక్యులర్ సహాయంతో పరిసర ప్రాంతాల్లో పరిశీలించారు. ఈ సందర్భంగా ఫైర్ అధికారి వేణు మాట్లాడుతూ.. నది ఉధృతి ఎక్కువగా ఉండటం, నదిలో బోటు దించేందుకు అనుకూలంగా లేదన్నారు. డోన్ర్ కెమెరా ద్వారా నదీ పరిసర ప్రాంతాల వెంట పరిశీలిస్తామని తెలిపారు. ప్రమీల ఆచూకీ ఎప్పుడు లభిస్తుందా? అని ఆమె కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు తుక్కాపూర్ బ్రిడ్జి వద్ద ఎదురు చూస్తున్నారు.