
పచ్చకామెర్లతో యువకుడు మృతి
జగదేవ్‌పూర్(గజ్వేల్): పచ్చకామెర్ల వ్యాధితో బాధపడుతూ యువకుడు మృతి చెందదాడు. ఈ ఘటన మండలంలోని బస్వాపూర్‌గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికు ల కథనం ప్రకారం.. .గ్రామానికి చెందిన రెడ్డమైన మహిపాల్(28) వ్యవసాయ పనులు చేస్తున్నాడు. వారం రోజుల క్రితం జ్వరం రావడంతో గ్రామంలోనే ఆర్‌ఎంపీ వద్ద వైద్యం చేయించుకున్నాడు. అయినా తగ్గకపోవడంతో గజ్వేల్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లగా పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడి చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి మృతి చెందాడు. అందరితో కలిసిమెలిసి ఉండే మహిపాల్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.