
మట్టి ప్రతిమలనే ప్రతిష్ఠించండి
జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానీచంద్ర
సంగారెడ్డి టౌన్: మట్టి గణపతులను పూజించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానీచంద్ర పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా కోర్టులో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మట్టి గణపతుల విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...వినాయక చవితి సందర్భంగా మట్టి గణపతులను పూజించాలని పర్యావరణాన్ని కాపాడాలన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.