
భూ సేకరణ చట్టం ఉల్లంఘన
● 30న నిమ్స్ కార్యాలయం ఎదుట ధర్నా
● వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు రాంచందర్
జహీరాబాద్‌టౌన్: భూ సేకరణ చట్టాన్ని ఉల్లఘించి అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు రాంచందర్ ఆరోపించారు. పట్టణంలోని శ్రామిక్ భవనంలో సోమవారం నిమ్స్ రైతుకూలీలతో నిర్వహించిన సమవేశంలో ఆయన మాట్లాడారు. భూ సేకరణ చట్టానికి తూట్లు పోడుస్తున్నారని, రైతుల నుంచి భూములను బలవంతంగా తీసుకుంటున్నారని మండిపడ్డారు. పరిశ్రమలు ఎప్పుడు వస్తాయో తెలియకుండా వ్యవసాయ భూములను తీసుకోవద్దని, కూలీలకు ఇవ్వాల్సిన పునరావాసం గురించి ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు. అధికారుల వైఖరికి నిరసనగా 30న నిమ్స్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో సంఘం నాయకులు శంకర్, బాలప్ప, సంజీవ్ పాల్గొన్నారు.