
వైద్యుల పర్యవేక్షణలో చిన్నారులు
72 గంటల పాటు అబ్జర్వేషన్
నర్సాపూర్: చుంచెలుక పడిన నీళ్లు తాగి అస్వస్థతకు గురైన చిన్నారులు స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శివ్వంపేట మండలం రత్నాపూర్ గ్రామానికి చెందిన అంగన్‌వాడీ కేంద్రంలో ఈనెల 23న ఎలుక పడిన నీళ్లు తాగి ఎనిమిది మంది చిన్నారులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. కాగా వారిలో రిషివర్ధన్‌కు కడుపు ఉబ్బడంతో అతన్ని ఆదివారం మెదక్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి పంపించారు. స్థానిక ఆస్పత్రిలో ఉన్న ఏడుగురిలో అక్షిత్ సోమవారం ఉదయం వాంతి చేసుకున్నాడు. 72గంటల అబ్జర్వేషన్‌లో ఉంచామని ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పావని, ఆర్‌ఎంఓ రాజేశ్‌కుమార్ తెలిపారు. మిగతా చిన్నారులు కోలుకుంటున్నారని చెప్పారు. చికిత్స పొందుతున్న చిన్నారులను బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్‌గౌడ్ పరామర్శించారు. ఆయన వెంట పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిన్న రమేశ్ గౌడ్, నాయకులు పెద్ద రమేశ్ గౌడ్, నారాయణరెడ్డి, చంద్రయ్య, బాల్‌రాజ్, రాజు, రాంరెడ్డి తదితరులు ఉన్నారు.