
ప్రతి మండపాన్ని సందర్శించాలి: ఎస్పీ
సంగారెడ్డి జోన్: ప్రతి వినాయక మండపాన్ని పోలీసు అధికారులు సందర్శించాలని ఎస్పీ పరితోష్ పంకజ్ ఆదేశించారు. సోమవారం తన కార్యాలయంలో పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ భద్రత నిర్వహణలో భాగంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునే విధంగా చూడాలన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయకులకే ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. డీజే బాక్స్‌లకు అనుమతి లేదని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ ఆన్ లైన్ లో అనుమతి పొందాలన్నారు. కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ శాంతియుత వాతావరణంలో పండుగ వేడుకలు జరుపుకోవాలని పేర్కొన్నారు.
బ్యాంకుల వద్ద బందోబస్తు
జిల్లాలోని వివిధ బ్యాంకుల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని బ్యాంకు అధికారులకు ఎస్పీ సూచించారు. సోమవారం బ్యాంకు అధికారులతో సమీక్షించారు. సైబర్ మోసాల పట్ల ప్రజలతోపాటు ఖాతాదారులకు బ్యాంకు, పోలీస్ అధికారులు కలిసి అవగాహన కల్పించాలన్నారు. ఈ సమావేశంలో సైబర్ క్రై మ్ డీఎస్పీ వేణుగోపాల్ రెడ్డి, వివిధ బ్యాంకు మేనేజర్లు పాల్గొన్నారు.