
టన్నుకు రూ. 1200
● ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇసుక పంపిణీ
● ఇతరులు రూ.1800 చెల్లించాలి
● నేడు ఇసుక బజార్ ప్రారంభం
ప్రజలకు స్టాక్ పాయింట్‌తో ప్రయోజనం చేకూరుతుంది. మార్కెట్‌లో టన్ను ఇసుకకు రూ.2700 వందల వరకు ఉంది. కేవలం ఇందిరమ్మ ఇళ్లకు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరూ కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇక్కడ మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు నాణ్యత కలిగిన ఇసుక దొరుకుతుంది. ప్రజలు టోకెన్‌న్ తీసుకుని తమ అవసరానికి అనుగుణంగా బుకింగ్ చేసుకోగలుగుతారు.
స్టాక్ పాయింట్‌తో ప్రయోజనం
జోగిపేట(అందోల్): ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా ఇసుక బజార్‌లను ఏర్పాటు చేసింది. అందోలు శివారులో టీజీఎండీసీఽ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇసుక బజార్‌ను మంగళవారం వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రారంభించనున్నారు. ప్రస్తుతం 1,500 టన్నుల ఇసుక అందుబాటులో ఉంది. ప్రభుత్వం సంగారెడ్డి జిల్లాలో ప్రయోగాత్మకంగా మూడు మండలాలను గుర్తించింది. ఇటీవల అందోలు, కోహీర్, నిజాంపేట మండలాల్లో ఇసుక స్టాక్ పాయింట్‌లను ఏర్పాటు చేసింది. డిజిటల్ మానిటరింగ్ ద్వారా కేంద్రాలను నిర్వహించనున్నట్లు సమాచారం. ఇందిరమ్మ లబ్ధిదారులు టన్ను ఇసుకకు రూ.1,200, ఇతరులు రూ.1,800 చెల్లించాలి. బహిరంగ మార్కెట్‌లో మాత్రం రూ.2వేలకు పైబడి ఉంది. ఇసుక ఎవరికి అవసరం ఉన్నా టీజీఎండీసీ వెబ్‌సెట్‌లో ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలి. మరుసటి రోజే సాండ్ బజార్ వద్దకు వచ్చి తీసుకొని వెళ్లవచ్చని ప్రాజెక్టు ఆఫీసర్ ఆకుల శ్రీకాంత్ తెలిపారు. ట్రాన్స్‌పోర్టు ఖర్చులు లబ్ధిదారుడే భరించాలని చెప్పారు.
డిమాండ్‌కు తగ్గ సరఫరా లేకపోతే
డిమాండ్‌కు తగ్గ సరఫరా లేకపోతే ప్రజలు మళ్లీ మార్కెట్ వైపు వెళ్లిపోయే అవకాశం ఉంది. ఇసుక పంపిణీలో రాజకీయ నాయకుల ప్రమేయం లేనట్లయితే అధికారిక వ్యవస్థ స్వేచ్ఛగా పనిచేస్తే ప్రభుత్వ ఆశయం నెరవేరే అవకాశం ఉంది. సర్కారే ఇసుక స్టాక్ పాయింట్‌లను ఏర్పాటు చేస్తుండటంతో అమ్మకం ద్వారా ఖజానాకు ఆదాయం రావడంతోపాటు, అక్రమ మాఫియా నియంత్రణ జరుగుతుంది. నిర్వహణ పారదర్శకంగా ఉండి, పాలసీ అనుసరణ, టెండర్లు, డిజిటల్ మానిటరింగ్ ఉంటే.. కేంద్రాలు విజయవంతమయ్యే అవకాశం ఉంది.