మెనూ ప్రకారం భోజనం | - | Sakshi
Sakshi News home page

మెనూ ప్రకారం భోజనం

Aug 26 2025 8:30 AM | Updated on Aug 26 2025 8:30 AM

మెనూ ప్రకారం భోజనం

మెనూ ప్రకారం భోజనం

మెనూ ప్రకారం భోజనం గిరిజన బిడ్డకు అరుదైన గౌరవం చెత్త సేకరణ షెడ్లను వినియోగించుకోవాలి విద్యపై నిర్లక్ష్యం తగదు గణనాథుల తయారీపై పోటీలు మద్యం దుకాణాలు కేటాయించాలి

వార్డెన్‌కు ఏఎస్‌డబ్ల్యూఓ ఆదేశం

వట్‌పల్లి(అందోల్‌): వసతి గృహాల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని ఏఎస్‌డబ్ల్యూఓ శ్రీనివాస్‌రావు అన్నారు. సోమవారం వట్‌పల్లి మండలం దేవునూర్‌ వసతి గృహాన్ని తనిఖీ చేశారు. విద్యార్థులకు అందుతున్న భోజనం, వసతిగృహం పరిసరాలను పరిశీలించారు. మెనూ ప్రకారం భోజనం అందించడంలేదని విద్యార్థులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. దీంతో వార్డెన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వంట సిబ్బందిని ఇతర చోట్లకు పంపించారు. వార్డెన్‌ అందుబాటులో ఉండాలన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

సంగారెడ్డి: గిరిజన బిడ్డకు అరుదైన గౌరవం దక్కింది. పుల్కల్‌ మండలం లాల్‌సింగ్‌ నాయక్‌ తండాకు చెందిన రామావత్‌ ప్రకాశ్‌ వ్యాయామ విద్య(స్పోర్ట్స్‌)లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్‌ పట్టా అందుకున్నారు. నగరంలో ఇటీవల జరిగిన స్నాతకోత్సవంలో రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ, ఇస్రో చైర్మన్‌ నుంచి పట్టా అందుకున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ప్రకాశ్‌ను అభినందించారు.

డీపీఓ సాయిబాబా

సంగారెడ్డి టౌన్‌: గ్రామాల్లోని చెత్త సేకరణ షెడ్లను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని డీపీఓ సాయిబాబా అన్నారు. సోమవారం మండలంలోని తాళ్లపల్లిలో ఉన్న డంపు యార్డ్‌, శ్మశానవాటిక, చెత్తసేకరణ షెడ్డును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తడి, పొడి చెత్త సేకరణ చేయించాలన్నారు. అనంతరం గ్రామంలో పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు.

ఏబీవీపీ అధ్యక్షుడు ఈశ్వర్‌

జహీరాబాద్‌ టౌన్‌: పెండింగ్‌ స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులను విడుదల చేయాలని ఏబీవీపీ జహీరాబాద్‌ అధ్యక్షుడు ఈశ్వర్‌ డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో రూ.8,300 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి విద్యపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, నిధులు విడుదల చేయడంలో జాప్య ం వహిస్తున్నారని ఆరోపించారు. పేద విద్యా ర్థులు స్కాలర్‌షిప్‌పై ఆధారపడి చదువుతుంటారని, ఫీజులు చెల్లించనిదే కళాశాల నిర్వాహకులు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని వాపోయారు. ప్రభుత్వం స్పందించి వెంటనే బకాయిలు విడుదల చేయాలని కోరారు. నాయకులు బసవరాజ్‌, అభివర్ధన్‌, సమీర్‌ పాల్గొన్నారు.

నారాయణఖేడ్‌: పర్యావరణహిత మట్టి, ఇతర సహజ వనరులతో గణనాథుల తయారీపై విద్యార్థులకు మండల, డివిజన్‌స్థాయి పోటీలకు సబ్‌ కలెక్టర్‌ ఉమాహారతి శ్రీకారం చుట్టారు. పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా ఆమె ప్రత్యేకంగా పోటీల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. డివిజన్‌ పరిధిలోని 14 గురుకులాల్లో పోటీలు పూర్తయ్యాయి. సోమవారం నుంచి డివిజన్‌ పరిధిలోని 34 ఉన్నత పాఠశాలల్లో పోటీలు ప్రారంభమయ్యాయి. మండల, డివిజన్‌ స్థాయిల్లో అందంగా తయారు చేసిన విద్యార్థులను ఎంపికచేసి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేయనున్నట్లు ఆమె వివరించారు.

నారాయణఖేడ్‌: మద్యం దుకాణాల టెండర్లలో కల్లుగీత కార్మికులకు 25 శాతం కేటాయించాలని గీత కార్మిక కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి గోపి డిమాండ్‌ చేశారు. సోమవారం స్థానిక అంబేడ్కర్‌ భవన్‌లో నిర్వహించిన సంఘం డివిజన్‌ స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. మేనిఫెస్టోలో పేర్కొన్న మేరకు 25 శాతం దుకాణాలను కేటాయించాలన్నారు. వ్యక్తిగతం కాకుండా కల్లుగీత సహకార సంఘాలకు కేటాయిస్తే ఎక్కువ మందికి లబ్ధి చేకూరుతుందన్నారు. వృత్తి పెన్షను రూ.5 వేలకు పెంచి కల్లుగీత కార్పొరేషన్‌కు రూ.5 వేల కోట్లు కేటాయించాలన్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు అంజాగౌడ్‌, ఖేడ్‌ డివిజన్‌ అధ్యక్షుడు భూమాగౌడ్‌, జిల్లా, స్థానిక బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement