
మృత్యు కుహరాలు
పరిశ్రమలు..
● తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ యంత్రాలను సర్దేసి
● ఇరుకై న ప్రదేశాల్లో కొనసాగుతున్న వస్తు ఉత్పత్తి
● కాలం చెల్లిన యంత్ర పరికరాలనే కొనసాగింపు
● పని ప్రదేశంలో కనీసం వెంటిలేషన్ కూడా కరువు
● పరిశ్రమల్లో కార్మికుల భద్రత ప్రమాణాలు గాలికి..
● అధికారుల తనిఖీల్లో వెలుగులో ఆందోళనకరమైన అంశాలు
పాశమైలారం పారిశ్రామికవాడలో సుమారు 30 ఏళ్ల క్రితం ఎకరం విస్తీర్ణంలో ప్రారంభమైన పరిశ్రమలో ఉత్పత్తి సామర్థ్యం మూడు రెట్లు పెరిగింది. పెరిగిన ఉత్పత్తి సామర్థ్యానికి అవసరమైన అదనపు యంత్ర పరికరాలు మాత్రం అదే ఎకరంలోనే సర్దేశారు. దీంతో ఇరుకు షెడ్లలో కార్మికులు పనిచేస్తున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే పదుల సంఖ్య ప్రాణాలు గాలిలో కలిసే పరిస్థితులు నెలకొన్నాయి.
40 పరిశ్రమల్లో తనిఖీలు పూర్తి
తొలి విడతలో హై రిస్క్ పరిశ్రమలను తనిఖీలు చేస్తున్నారు. ప్రమాదాలు జరిగితే ప్రాణనష్టం, ఆస్తినష్టం ఎక్కువగా ఉండేందుకు ఆస్కారం ఉన్న ఫార్మా, కెమికల్, గ్లాస్, బల్క్‌డ్రగ్, పెయింట్ వంటి పరిశ్రమల్లో తనిఖీలు సాగుతున్నాయి. మొత్తం 599 పరిశ్రమలను తనిఖీలు చేయాల్సి ఉండగా, 48 పరిశ్రమలను తనిఖీలు చేశారు. ఇందులో నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న సుమారు ఎనిమిది పరిశ్రమలకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని అధికారులు భావిస్తున్నారు. నెల రోజుల్లో ఈ తనిఖీలు పూర్తికి ప్రభుత్వం నెలరోజులు గడువు విధించింది. ఈ తనిఖీలన్నీ పూర్తి కావడానికి మరో మూడు నెలలు పట్టే అవకాశాలు ఉన్నాయని ఫ్యాక్టరీల శాఖ అధికారులు పేర్కొంటున్నారు.