అదనపు కలెక్టర్ చంద్రశేఖర్
హత్నూర (సంగారెడ్డి): గ్రామపంచాయతీలుగా వారీగా తప్పులు లేకుండా తుది జాబితా ఓటర్ జాబితాను తయారుచేసి పెట్టుకోవాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు. హత్నూర మండల పరిషత్ కార్యాలయంలో ఓటర్ జాబితా తయారీపై కంప్యూటర్లో స్వయంగా జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ పరిశీలించారు. ఎలాంటి తప్పులు లేకుండా గ్రామపంచాయతీ వారీగా, వార్డుల వారీగా కూడా ఓటర్ లిస్టును సిద్ధం చేయాలని, ఆ బాధ్యత మండల స్థాయి అధికారులపై ఉందని తెలిపారు. ఉపాధి హామీ పథకం ద్వారా మొక్కలు నాటేందుకు అధికారులు అంతా సమన్వయంతో పని చేయాలని సూచించారు.
ఆ పిటిషన్‌ను వెనక్కి తీసుకోవాలి
జహీరాబాద్ టౌన్: గిరిజనులను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకోవాలని గిరిజన సంక్షేమ సంఘం అధ్యక్షుడు రఘునాథ్ రాథోడ్ డిమాండ్ చేశారు. పట్టణంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ...భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, మాజీమంత్రి సోయం బాబురావు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారన్నారు. దీని వెనుక పెద్ద కుట్రదాగి ఉందని, ఈ పిటిషన్‌తో గిరిజనులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. లంబాడీల వల్లే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, ఇద్దరిని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోరారు.
సైనిక కుటుంబాలకు న్యాయ సేవలు అందిస్తాం
సంగారెడ్డి టౌన్: జిల్లాలోని సైనిక కుటుంబాలకు న్యాయపరమైన సేవలు అందిస్తామని జిల్లా న్యాయ సేవధికారి సంస్థ కార్యదర్శి సౌజన్య స్పష్టం చేశారు. కలెక్టరేట్‌లో బుధవారం జిల్లా సైనిక్ బోర్డులో న్యాయ సేవల క్లినిక్‌ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా సౌజన్య మాట్లాడుతూ..దేశ సరిహద్దులను కాపాడే సైనికులు తమ కుటుంబాలు ఎదుర్కొంటున్న చట్టపరమైన సమస్యల గురించి పరిష్కరిస్తామన్నారు. ప్రత్యేకంగా సేవల కోసం ఏర్పాటు చేసిన క్లినిక్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఇళ్ల నిర్మాణాలకు అనుమతులివ్వాలి: మాణిక్యం
కొండాపూర్(సంగారెడ్డి): ఇళ్ల స్థలాలు కలిగి పట్టా సర్టిఫికెట్‌లు ఉన్న వారికి ఇంటి నిర్మాణాలకు అనుమతులివ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు మాణిక్యం డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం మండల పరిధిలోని గంగారం పంచాయతీ కార్యాలయం ముందు ఆందోళన చేశారు. ఇళ్ల స్థలాల పట్టాలిచ్చి పొజిషన్ చూపెట్టి రెండేళ్లైనా నిర్మాణాలకు ఎందుకు అనుమతించడంలేదని పంచాయతీ కార్యదర్శిని నిలదీశారు. పర్మిషన్లు ఇచ్చేంతవరకు ఆందోళన విరమించమని చెప్పడంతో పంచాయతీ కార్యదర్శి తహసీల్దార్‌తో ఫోన్‌లో మాట్లాడి స్థలాల పట్టాలు ఉన్నవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకుంటే అనుమతులిస్తామని, ఈనెల 15 తర్వాత తహసీల్దారు వచ్చి పరిశీలిస్తారని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

తప్పుల్లేకుండా ఓటర్ జాబితా

తప్పుల్లేకుండా ఓటర్ జాబితా