
బైక్‌ను ఢీకొట్టిన కారు
● ప్రమాదంలో భార్య మృతి
● భర్తకు తీవ్రగాయాలు
తూప్రాన్‌న్ /మనోహరాబాద్(తూప్రాన్): రోడ్డు ప్రమాదంలో భార్య అక్కడికక్కడే మృతి చెందగా, భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన పట్టణ సమీపంలో సోమవారం చేసుకుంది. ఎస్‌ఐ వివరాల ప్రకారం... మనోహరాబాద్ మండలం కూచారం గ్రామానికి చెందిన దాసరి రమేశ్, స్వప్న(29) దంపతులు యాక్టీవాపై చేగుంట మండలం మక్కరాజ్‌పేటలో స్వప్న పెద్దనాన్న ఇంట్లో జరిగే శుభకార్యానికి ఆదివారం వెళ్లారు. తిరిగి సోమవారం ఇంటికి వస్తున్న క్రమంలో 44వ జాతీయ రహదారిపై మాసాయిపేట స్టేషన్ సమీపంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో స్వప్న అక్కడికక్కడే మృతి చెందింది. భర్త రమేశ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. రమేశ్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.