
అర్జీల పరిష్కారానికి ఎదురుచూపులు
● ప్రజావాణిలో వాపోతున్న అర్జీదారులు ● అర్జీలు స్వీకరించిన అదనపు కలెక్టర్లు
సంగారెడ్డి జోన్: తమ సమస్యల పరిష్కారానికి ఎదురు చూపులు తప్పటం లేదని అర్జీదారులు వాపోతున్నారు. కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు వేసినా తమ సమస్యలు పరిష్కారం కావటం లేదని అధికారుల తీరుపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి ప్రజలు కలెక్టరేట్‌కు వచ్చి తమ గోడును వెళ్లబోసుకున్నారు. జిల్లా అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, డీఆర్‌ఓ పద్మజారాణి హాజరై అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...ప్రజావాణి సమస్యలు పెండింగ్‌లో ఉంచకుండా త్వరితగతిన పరిష్కరించాలన్నారు.
ఇంటి నంబరు చూపించడం లేదు:
రాజు, సదాశివపేట
తమ ఇంటి నంబరు రికార్డులతోపాటు ఆన్‌లైన్‌లో చూపించడం లేదని అధికారులు చెబుతున్నారు. 2005 వరకు ఇంటికి సంబంధించిన పన్ను కట్టాను. మా నాన్నమ్మ మృతి చెందడంతో పన్ను కట్టేందుకు వెళితే మీ ఇంటి వివరాలు అందుబాటులో లేవని చెబుతున్నారు.
కుల ధ్రువపత్రాలు అందించాలి:
బొప్పల బాబు, తోలుబొమ్మలాట సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
తమకు తమ కుల ధ్రువ పత్రాలు అందించాలి. ప్రభుత్వం జారీ చేసిన కొత్త కులాల జీవో ఉన్నప్పటికీ తమకు పత్రాలు అందించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. కార్యాలయాల చుట్టూ తిరిగి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. దీంతో తమ పిల్లలకు చదువుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు చర్యలు తీసుకుని తమకు పత్రాలు అందించాలి.

అర్జీల పరిష్కారానికి ఎదురుచూపులు

అర్జీల పరిష్కారానికి ఎదురుచూపులు