
సీసీఆర్‌టీ శిక్షణకు 10 మంది టీచర్లు
● ఈనెల 3 నుంచి ఢిల్లీలో సీసీఆర్టీ శిక్షణ తరగతులు ● 15 రోజుల పాటు నిర్వహణ
న్యాల్‌కల్(జహీరాబాద్): విద్యార్థులకు పూర్తిస్థాయి లో అర్థమయ్యే వినూత్న విధానంలో బోధనా పద్ధతులపై ప్రదర్శించిన పలువురు ఉపాధ్యాయులకు న్యూ ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. రాష్ట్రంలో పది మంది ఉపాధ్యాయులను అధికారులు ఎంపిక చేశారు. సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్ మండల పరిధి లోని రేజింతల్ ప్రాథమిక పాఠశాలకు చెందిన సఫియా సుల్తానా, ములుగు జిల్లా ఒడ్డెరగూడెం పాఠశాలకు చెందిన రాజేశ్‌కుమార్, మాన్‌సింగ్ తండా పాఠశాల కు చెందిన స్వప్న, మంచిర్యాల్ జిల్లా లోని ముల్కల్‌గూడ పాఠశాలకు చెందిన దిలీప్‌కు మార్, యాదగిరి జిల్లాలోని పాయిల్‌వాన్‌పూర్ పాఠశాలకు చెందిన రమేశ్, వికారాబాద్ జిల్లాలోని కన్‌కల్ పాఠశాలకు చెందిన ఈశ్వర్‌రావు, జగిత్యాల్ జిల్లాలోని తండ్రియాల్ పాఠశాలకు చెందిన విజయ్‌కుమార్, వర్షకొండ పాఠశాలకు చెందిన రమేశ్, మెదక్ జిల్లాలోని దంతెనపల్లి పాఠశాలకు చెందిన కవిత నిర్మల్ జిల్లాలోని సేవాలాల్ తండా పాఠశాల కు చెందిన ప్రవీణ్‌కుమార్ ఢిల్లీలో నిర్వహించే ప్రద ర్శనలకు ఎంపికై న ట్లు అధికారులు తెలిపారు. జాతీ య విద్యా విధానం 2020లో భాగంగా సాంస్కృతిక వనరులు శిక్షణ కేంద్రం వీరికి ఈ నెల 3 నుంచి 19వ వరకు 15 రోజులపాటు శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు.