
హెచ్‌ఎం సొంత నిధులు
కొండపాక(గజ్వేల్): దూర ప్రాంతాలనుంచి విద్యార్థులు తమ స్కూలు వచ్చేందుకు ఏడాది పాటు ఆటో ద్వారా రవాణా సౌకర్యాన్ని కల్పిస్తున్నారు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం సిర్సనగండ్లలోని ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జయప్రకాశ్‌రెడ్డి. దీంతోపాటుగా పాఠశాల ఆవరణలో ఆట వస్తువులు క్రీడా దుస్తులు, స్వచ్ఛమైన తాగు నీటి ఆర్వో ప్లాంట్, ఐఎఫ్‌బీ స్క్రీన్ ఎల్‌ఈడీ ప్యానల్, కంప్యూటర్, తరగతి గదుల్లో కార్పెట్లు, పాఠశాలకు అందమైన రంగులు వేయడం వంటి వాటి కోసం సుమారు రూ. 9లక్షలను తన సొంత డబ్బుల్ని ఖర్చుపెట్టి పాఠశాలకు మంచి పేరు తీసుకొచ్చారు. ఇక బడిబాట కార్యక్రమంలో ఇల్లిల్లూ తిరుగుతూ పాఠశాలలో లభించే వసతులు, సౌకర్యాల గురించి వివరించడంతో తమ పిల్లలను ఈ బడిలో చేర్పించేందుకు ముందుకు వచ్చారు. సుమారు 70 మందికిపైగా ప్రైవేట్ స్కూల్‌కు వెళ్లే విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరారు. ప్రస్తుతం 210 మంది విద్యార్థులు ఈ బడిలో చదువుకుంటున్నారు.

హెచ్‌ఎం సొంత నిధులు