
గుంతలమయంగా రోడ్లు
● మరమ్మతులకు నోచుకోని వైనం ● ప్రమాదాలకు గురవుతున్నవాహనదారులు
హత్నూర(సంగారెడ్డి): ప్రధాన రహదారులు గుంతలమయంగా మారాయి. ఈ రోడ్లపై ప్రయాణించాలంటేనే వాహనదారులు జంకుతున్నారు. మండల కేంద్రం నుంచి జోగిపేటకు వెళ్లే ప్రధాన రహదారి అధ్వానంగా మారింది. హత్నూరలో సుమారు 200 మీటర్ల వరకు రోడ్డు మొత్తం గుంతలమయంగా మారి ప్రమాదాలు సంభవిస్తున్నాయి. అయినా అధికారులు, నాయకులు ఎవరూ పట్టించుకోవడంలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్యాల వెళ్లే ప్రధాన రహదారితో పాటు దౌల్తాబాద్ నుంచి నాగుల్దేవులపల్లి వెళ్లే ప్రధాన రోడ్డుపై గుంతలు ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. హత్నూర నుంచి నవాబుపేట వెళ్లి రహదారి పూర్తిగా ధ్వంసం అయింది. మల్కాపూర్ నుంచి పటాన్‌చెరు వెళ్లే ప్రధాన రహదారి సైతం గుంతలమయంగా మారింది. తరచూ ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకునే నాథుడు కరువయ్యారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి రోడ్లపై ఏర్పడిన గుంతలకు మరమ్మతులు చేయాలని పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
ఆ రోడ్డుపై వెళ్లాలంటే భయం
హత్నూర నుంచి సిరిపురం వరకు బైక్‌పై వెళ్లాలంటే ఎప్పుడు ఏ గుంతలో పడి ప్రమాదం సంభవిస్తోందనని భయంగా ఉంది. రాత్రి సమయంలో ప్రమాదాలు జరిగిన సంఘటనలు ఉన్నాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి గుంతలు పడిన రోడ్లకు మరమ్మతులు చేయాలి.
– ప్రవీణ్‌గౌడ్, హత్నూర
నిధులు రాగానే మరమ్మతులు
ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన వెంటనే రోడ్లకు మరమ్మతులు చేయిస్తాం. ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. నిధులు రాగానే గుంతలు ఏర్పడిన రహదారులకు మరమ్మతులు చేయించేందుకు కృషి చేస్తాం.
– రవీందర్, ఆర్‌అండ్‌బీ, డీఈ
●

గుంతలమయంగా రోడ్లు

గుంతలమయంగా రోడ్లు