
పుణ్యక్షేత్రాలకు బయలుదేరిన బస్సులు
నారాయణఖేడ్: రాష్ట్రంలోని 10 పుణ్యక్షేత్రాలను భక్తులు దర్శించుకుని వచ్చేలా ఖేడ్ నుంచి ప్రత్యేకంగా ఒక ఎక్స్‌ప్రెస్, ఒక సూపర్ డీలక్స్ బస్సు శుక్రవారం ఉదయం 8 గంటలకు ఖేడ్ నుంచి బయలుదేరాయి. స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లో ఆయా బస్సులకు డ్రైవర్లు పూజలు నిర్వహించగా ఆర్టీసీ డిప్యూటీ రీజినల్ మెనేజర్ కృష్ణమూర్తి జెండా ఊపి పంపించారు. బస్సులు 36 గంటలపాటు ప్రయాణించి 10 పుణ్యక్షేత్రాలైన వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, కాళేశ్వరం, రామగుండం, మిడ్‌మానేరు డ్యాం, వరంగల్, సిద్దిపేట, మెదక్, ఏడుపాయలను దర్శించుకుని శనివారం సాయంత్రం తిరిగి ఖేడ్‌కు చేరుకోనున్నాయి. స్థానిక ఆర్టీసీ డీఎం మల్లేశయ్య, అసిస్టెంట్ మెనేజర్ నర్సింహులు, అసిస్టెంట్ మెకానికల్ ఇంజినీర్ దశరథ్, నెహ్రూ, బీరయ్య, పాండు, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.