
● టీచర్ల తనిఖీలపైవెల్లువెత్తుతున్న విమర్శలు ● విద్యలో న
నారాయణఖేడ్: విద్యావ్యవస్థ బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బడుల తనిఖీ కోసం ఉపాధ్యాయుల నియామకం ప్రక్రియపై సర్వత్రా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ఈ నెల 25న ఆర్సీ నంబరు 70 ద్వారా ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేసేందుకు ఉపాధ్యాయుల నియామకం కోసం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం జిల్లాలో కూడా త్వరలో బడుల తనిఖీ కోసం ఉపాధ్యాయుల ఎంపిక జరగనుంది. జిల్లాలో మొత్తం ఉపాధ్యాయులు 5,278మంది కాగా, ఎస్‌జీటీలు 2,587మంది ఉన్నారు. ఇటీవల కొత్తగా 415మంది నియామకం అయ్యారు. ఈ లెక్కన ప్రాథమిక పాఠశాలలకు 9 నుంచి 10మంది వరకు, హైస్కూల్స్‌కు 8 నుంచి 10మంది వరకు టీచర్లు తనిఖీ అధికారులుగా నియామకం కానున్నారు. ఉపాధ్యాయ సంఘాల నుంచి వ్యతిరేక వైఖరి వ్యక్తం అవుతుండగా విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యావేత్తల నుంచి ఉపాధ్యాయులు కాకుండా ఇతర అధికారుల ద్వారా తనిఖీలు జరగాలన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తనిఖీలు తప్పకుండా జరాగాలని, కానీ ఉపాధ్యాయులే తనిఖీలు చేస్తే వారు సహ ఉపాధ్యాయులపై చర్యలకు సిఫారసు చేసే అవకాశాలు ఉండవని అంటున్నారు. తనిఖీ అధికారిగా నియామకం అయ్యే ఉపాధ్యాయుడు సదరు పాఠశాలలో ఖాళీ కావడం వల్ల అక్కడి పిల్లలకు అన్యాయం జరిగే అవకాశముంటుందన్న అభిప్రాయాలు సంఘాల నుంచి వ్యక్తం అవుతున్నాయి.
నాణ్యతకోసమే తనిఖీలు...
ప్రస్తుతం ప్రతీ మండలంలో ఎంఈవోలు, కాంప్లెక్స్ హెచ్‌ఎంలు పాఠశాలల పర్యవేక్షణ చేస్తుండగా ప్రత్యేకంగా ఎంపిక చేసి నియమించిన టీచర్లను తనిఖీ అధికారులుగా వ్యవహరించనున్నారు. ఉన్న టీచర్లలో 2% ఉపాధ్యాయులను తనిఖీ అధికారులుగా నియామకం కానున్నారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో రోజుకు కనీసం రెండు పాఠశాలలు, ఉన్నత పాఠశాలల్లో రోజుకు ఒక్క పాఠశాలను తనిఖీ చేయాలి. బోధనా పద్ధతులు పెర్మార్మెన్స్, రికార్డుల నిర్వహణ, పాఠ్య ప్రణాళిక తయారీని వాడుతున్నారా లేదా?, అకడమిక్ క్యాలెండర్ ప్రకారం సిలబస్ అవుతుందా లేదా?, మూల్యాంకన విధానం జరుగుతున్న తీరు, కో–కరిక్యులర్స్ , పాఠశాల గ్రంథాలయం నిర్వహణ, ఫిజికల్ ఎడ్యుకేషన్, లేబోరోటరీ నిర్వహణ తదిరత అంశాలను పాఠశాలల వారీగా క్షుణ్ణంగా పరిశీలించాలి.
ఉపాధ్యాయ సంఘాల పెదవి విరుపు
పాఠశాలల పర్యవేక్షణ బాధ్యతలను ఉపాధ్యాయులకు అప్పగించడం సరికాదని, ఈ ఉత్తర్వులను విరమించుకోవాలని పలు సంఘాల నేతలు పేర్కొంటున్నారు. ఉపాధ్యాయుల తనిఖీ బాధ్యతల్లో ఉండటంవల్ల వారు సేవలందిస్తున్న ఆయా పాఠశాలల్లో బోధన స్తంభించిపోతుందని చెబుతున్నారు.

● టీచర్ల తనిఖీలపైవెల్లువెత్తుతున్న విమర్శలు ● విద్యలో న