
స్వేచ్ఛా వాతావరణంలోనే బోధన
కొండాపూర్(సంగారెడ్డి): చిన్నారులను మూడేళ్ల వయసు నుంచే కార్పోరేట్, ప్రైవేట్ పాఠశాలలకు పంపించడం వల్ల ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉందని, విద్యా బోధన ఎప్పుడూ స్వేచ్ఛాయుత వాతావరణంలోనే జరగాలని ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు పేర్కొన్నారు. మండల పరిధిలోని తొగర్‌పల్లిలో అంగన్‌వాడీ విద్యార్థులకు బుధవారం నిర్వహించిన బాల మేళా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ కేంద్రాలలో చిన్నారులకు నేర్పించే ఆట, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రతి రోజూ అంగన్‌వాడీ పిల్లలకు అందించే పూర్వ ప్రాథమిక విద్య ఏ విధంగా ఉంటుందో ప్రదర్శన ద్వారా తెలియజేశారు. కార్యక్రమంలో ఎంఈఓ దశరథ్, సీడీపీఓ చంద్రకళ, సూపర్‌వైజర్‌లు విమల, శైలజ, టీచర్‌లు స్వప్న, సుశీల, లలిత, అరుణ తదితరులు పాల్గొన్నారు.
ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు