
మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి
న్యాల్‌కల్(జహీరాబాద్): మత్తు పదార్థాలకు అలవాటు పడి కొందరు విలువైన జీవితాలను పాడు చేసుకుంటున్నారని, వాటికి దూరంగా ఉండాలని హద్నూర్ ఎస్‌ఐ చల్లా రాజశేఖర్ అన్నారు. న్యాల్‌కల్‌లోని ఎస్‌బీఐ ఆవరణలో మాదక ద్రవ్య నిర్మూలన కార్యక్రమంపై ఆదివారం ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి పౌరుడు డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పోరాటం చేయాలని కోరారు. మత్తు పదార్థాలు వినియోగించడం, సరఫరా చేయడం నేరమన్నారు. డ్రగ్స్ వినియోగించడం వల్ల కలిగే నష్టాలను వివరించారు. కార్యక్రమంలో స్థానిక పీఏసీఎస్ చైర్మన్ సిద్ధిలింగయ్యస్వామి, పోలీసు సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.