
డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం
సీఐ వినాయక్ రెడ్డి
పటాన్‌చెరు టౌన్: డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా ప్రతీ ఒక్కరు పాటుపడాలని పటాన్‌చెరు సీఐ వినాయక్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలం పరిధి ఇంద్రేశం వికాస్ అసోసియేషన్ సభ్యులకు యాంటీ డ్రగ్స్ అవేర్‌నెస్ వీక్‌లో భాగంగా డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించడమే ఈ వార్షికోత్సవ లక్ష్యం అన్నారు. సే నో–టు డ్రగ్స్ అనే నినాదం ప్రతి ఒక్కరి దాకా చేరేలా చూడాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ ఆరోగ్యాన్ని పూర్తిగా నాశనం చేస్తాయి. అనంతరం వారితో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ మహేశ్వర్ రెడ్డి, కానిస్టేబుల్‌లు, ప్లాట్ ఓనర్స్ తదితరులు పాల్గొన్నారు.