ప్రభుత్వ రోడ్డును కబ్జా నుంచి కాపాడండి
మెదక్ కలెక్టరేట్: పంట పొలాలకు వెళ్లే ప్రభుత్వ రోడ్డుతోపాటు చెరువు శిఖం, కుంటలను కబ్జాకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కౌడిపల్లి మండలం చిన్న గొట్టిముక్ల గ్రామ రైతులు సోమవారం కలెక్టరేట్‌ఽ ఎదుట ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ రైతులు మాట్లాడుతూ.. తమ గ్రామ శివారులోని సర్వే నం.292లో అన్ని కులాల వారికి సంబంధించి 95 ఎకరాలు భూమి ఉంది. సర్వే నం.264, 274, 275, 276లో సుమారు 55 ఎకరాల పట్టా భూమి ఉందన్నారు. ఈ భూముల్లో పంటలు వేసుకొని జీవనం సాగిస్తున్నట్లు తెలిపారు. ఈ భూముల్లోకి వెళ్లేందుకు తాత ముత్తాతల కాలం నుంచి 3 కిలో మీటర్ల మేర దారి ఉన్నట్లు తెలిపారు. అప్పట్లో టీడీపీ ప్రభుత్వం రైతుల కోసం పనికి ఆహార పథకం కింద రోడ్డును బాగు చేసినట్లు తెలిపారు. కానీ ఈ దారిని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగుల రవీందర్‌రెడ్డి, స్థానికులు గడిల సుదర్శన్‌రావు కలిసి ధ్వంసం చేసి ఆక్రమించకున్నట్లు ఆరోపించారు. వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.
ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే అండతో
స్థానికుల ఆక్రమణ
కలెక్టరేట్ ఎదుట రైతులు నిరసన


