50 బస్తాలు గోల్‌మాల్‌ | - | Sakshi
Sakshi News home page

50 బస్తాలు గోల్‌మాల్‌

May 13 2025 8:01 AM | Updated on May 13 2025 8:01 AM

50 బస్తాలు గోల్‌మాల్‌

50 బస్తాలు గోల్‌మాల్‌

పాపన్నపేట(మెదక్‌): కొనుగోలు కేంద్రంలో 50 బస్తాల ధాన్యం గోల్‌మాల్‌ జరిగినట్లు పాపన్నపేట కౌలు రైతు బైండ్ల భూమయ్య ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం.. పాపన్నపేట పెద్ద హరిజన వాడ వద్ద ఐకేపీ సభ్యుల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయి. శుక్రవారం రాత్రి గ్రామానికి చెందిన కౌలు రైతు బైండ్ల భూమయ్య, బట్టి భారతి, ప్రభాకర్‌, నదరి నారాయణ, చోటు, కుర్మ కిషన్‌కు చెందిన 766 బస్తాలతో లారీ లోడ్‌ చేశామన్నాడు. అందులో తనవి 391 బస్తాలు ఉన్నాయని, 389 బస్తాల వరకు లెక్క కట్టి డ్వాక్రా గ్రూపు సభ్యురాలు సంచిపై సంఖ్య రాసిందన్నారు. అనంతరం రెండు సంచులు తెచ్చి తూకం చేసి లెక్క రాయించానన్నారు. శనివారం ఉదయం ట్రక్‌ షీట్‌ లేకుండానే లారీ లక్ష్మీనగర్‌ ప్రాంతంలోని ఓ రైస్‌ మిల్లుకు వెళ్లిందన్నారు. ఆదివారం ఐకేపీ సభ్యులు తనకు చెందిన 50 ధాన్యం బస్తాలు తక్కువగా వచ్చినట్లు సమాచారం ఇచ్చారని వాపోయాడు. సుమారు 20 క్వింటాళ్ల ధాన్యం తక్కువగా వచ్చిందంటున్నారని, దీంతో సుమారు రూ.47 వేల నష్టం వస్తుందన్నారు.

ట్రక్‌ షీట్‌ లేకుండానే లారీ వెళ్లింది

ఈ విషయమై కమ్యూనిటీ కో ఆర్డినేటర్‌ శివరాణిని వివరణ కోరగా.. అప్పటికే చీకటి కావడంతో కమిటీ మెంబర్లు లారీ పూర్తి స్థాయిలో లోడ్‌ కాక ముందే ఇంటికెళ్లారని అన్నారు. శనివారం పొద్దున కేంద్రం వద్దకు వచ్చే సరికి లారీ లోడ్‌ చేసుకొని ట్రక్‌ షీట్‌ లేకుండానే వెళ్లి పోయిందన్నారు. ట్రక్‌ షీట్‌పై కమిటీ మెంబర్ల సంతకాలు ఉంటాయన్నారు. అనంతరం 50 సంచులు తక్కువగా వచ్చినట్లు చెప్పారన్నారు. హమాలీలు కూడా క్వింటాల్‌కు రూ.40 తీసుకుంటున్నందున వారి వద్ద కూడా లారీలో ఎన్ని బస్తాలు వెళ్లిన లెక్క ఉండాలన్నారు. ఈ విషయమై విచారణ జరుపుతున్నామని తెలిపారు.

సుమారు రూ.47 వేల వరకు నష్టం

న్యాయం చేయాలంటూ

కౌలు రైతు ఆవేదన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement