హల్దీ ప్రాజెక్ట్‌లో వ్యక్తి గల్లంతు | - | Sakshi
Sakshi News home page

హల్దీ ప్రాజెక్ట్‌లో వ్యక్తి గల్లంతు

May 9 2025 8:15 AM | Updated on May 9 2025 8:15 AM

హల్దీ

హల్దీ ప్రాజెక్ట్‌లో వ్యక్తి గల్లంతు

వెల్దుర్తి(తూప్రాన్‌): చేపలు పట్టడానికి హల్దీ ప్రాజెక్ట్‌లోకి దిగిన యువకుడు నీటమునిగి గల్లంతయ్యాడు. ఈ విషాదకర ఘటన మాసాయిపేట మండలం హకింపేట గ్రామ శివారులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని చెర్లపల్లి పంచాయతీ పరిధి వర్దవాని చెరువుతండాకు చెందిన ఎలక్ట్రీషియన్‌ రాజు వద్ద అదే తండాకు చెందిన కేతావత్‌ గోపాల్‌ పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఇరువురు హకీంపేట శివారులోని హల్దీ ప్రాజెక్ట్‌లో చేపలు పట్టడానికి గురువారం ఉదయం వెళ్లారు. చేపలు పట్టే క్రమంలో గోపాల్‌ ప్రమాదశాత్తు నీటమునిగి గల్లంతయ్యాడు. పక్కనే ఉన్న రాజు విషయాన్ని కుటుంబసభ్యులు, పోలీసులకు చేరవేశాడు. దీంతో పోలీసులు, ఫైర్‌ సిబ్బంది సహకారంతో ప్రాజెక్ట్‌లో సాయంత్రం వరకు గాలింపు చేపట్టినా ఆచూకీ లభ్యం కాలేదు. కాగా గోపాల్‌ గల్లంతుపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గోపాల్‌కు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు.

చికిత్స పొందుతూ

వ్యక్తి మృతి

వెల్దుర్తి(తూప్రాన్‌): ఇంటి ఆరుబయట కూర్చున్న వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలాడు. దీంతో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని అందుగులపల్లిలో చోటుచేసుకుంది. ఎస్సై రాజు కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన దున్న శేఖాగౌడ్‌(61) బుధవారం ఉదయం ఇంటి వరండాలో కూర్చొని ఉండగా ఒక్కసారిగా కుప్పకూలి స్ఫృహ కోల్పోయాడు. గమనించిన కుటుంబసభ్యులు మెదక్‌ ప్రభుత్వ ఆస్పత్రికి అక్కడి నుంచి హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో అక్కడ చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందాడు. కేసు దర్యాప్తులో ఉంది.

గుర్తు తెలియని వ్యక్తి..

నర్సాపూర్‌ రూరల్‌: గుర్తు తెలియని వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన నర్సాపూర్‌ మండల కేంద్రంలో గురువారం చోటుచేసుకుంది. ఎస్సై లింగం కథనం మేరకు.. నర్సాపూర్‌ ఆర్టీసీ బస్టాండ్‌లో ఈనెల 6న గుర్తు తెలియని వ్యక్తి స్ఫృహ తప్పి పడిపోయి ఉన్నట్లు ఆర్టీసీ కంట్రోలర్‌ సాన సత్యనారాయణ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అదే రోజు ఆ వ్యక్తిని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తుండగా గురువారం మృతి చెందాడు. మృతుడి కుడి చేతిపై పచ్చబొట్టు, ఒంటిపై స్కై బ్లూ వైట్‌ కలర్‌ చొక్కా, ఆలివ్‌ కలర్‌ పాయింట్‌ ఉంది.

మద్యానికి బానిసై కిందపడి..

జహీరాబాద్‌ టౌన్‌: గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందాడు. జహీరాబాద్‌ టౌన్‌ ఎస్‌ఐ.కాశీనాథ్‌ కథనం ప్రకారం.. పట్టణంలోని విద్యుత్‌ కాలనీకి చెందిన ప్రకాష్‌ (35) మద్యానికి బానిసయ్యాడు. ఈ నెల 4న తాగిన మత్తులో అదుపుతప్పి కింద పడగా తీవ్ర గాయాలయ్యాయి. వైద్యం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు దర్యాప్తులో ఉంది.

బావిలో పడిన వ్యక్తి సురక్షితం

కాపాడిన ఫైర్‌ సిబ్బంది

హుస్నాబాద్‌: హుస్నాబాద్‌ పట్టణంలోని మోడల్‌ స్కూల్‌ ఎదుట ఉన్న బావిలో గురువారం జక్కనపల్లి బుచ్చయ్య అనే వ్యక్తి ప్రమాదవశాత్తు జారి పడ్డాడు. స్థానికులు వెంటనే ఈ విషయాన్ని అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. ఇన్‌చార్జి ఫైర్‌ ఆఫీసర్‌ పరమేశ్వర్‌ ఆధ్వర్యంలో సిబ్బంది బావిలోకి నిచ్చెన వేసి బుచ్చయ్యను కాపాడారు. కాపాడిన వారిలో సిబ్బంది రాంచందర్‌, నరసింహ, శ్రీనివాస్‌, ఎల్‌.శ్రీనివాస్‌ ఉన్నారు.

హల్దీ ప్రాజెక్ట్‌లో వ్యక్తి గల్లంతు 
1
1/2

హల్దీ ప్రాజెక్ట్‌లో వ్యక్తి గల్లంతు

హల్దీ ప్రాజెక్ట్‌లో వ్యక్తి గల్లంతు 
2
2/2

హల్దీ ప్రాజెక్ట్‌లో వ్యక్తి గల్లంతు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement