సేవకు మించిన తృప్తి లేదు
రాజరాజేశ్వరీ రైస్‌మిల్ నిర్వాహకుడు బచ్చు జగదీశ్
హవేళిఘణాపూర్(మెదక్): ఎండకాలంలో వివిధ పనుల నిమిత్తం మండల కేంద్రానికి వచ్చిన ప్రజలకు దాహార్తి తీర్చడానికి మండల కేంద్రమైన హవేళిఘణాపూర్ రాజరాజేశ్వరీ రైస్‌మిల్ నిర్వాహకులు బచ్చు జగదీశ్ 12 ఏళ్లుగా సేవ చేస్తూ ముందుకెళ్తున్నారు. తన వంతుగా 2012 నుంచి ఇప్పటి వరకు అంబలి కేంద్రంను కొనసాగిస్తున్నారు. రైస్‌మిల్ వద్ద తన తాత పుల్లయ్య జ్ఞాపకార్థం అంబలి కేంద్రం ఏర్పాటు చేసి వారికి నిత్యం కూలీలతో అంబలి తయారు చేయిస్తున్నారు. అంబలి కేంద్రంకు నిత్యం దాదాపు వంద వరకు మంది వచ్చి అంబలి సేవిస్తుంటారు. కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తానని నిర్వాహకులు బచ్చు జగదీశ్ అన్నారు. నిత్యం దాదాపు 100మందికి పైగా సరిపోను అంబలి తయారు చేసి ప్రజలకు పంపిణీ చేస్తున్నారు.


