
నిజమైన ప్రేమకు అర్థం
దుబ్బాకటౌన్ : ఏడడుగులు నడవడమే కాదు.. జీవితంతాం తోడుగా ఉంటారనడానికి ఈ దృశ్యమే నిదర్శనం. మానవత్వాలే మంటలో కలుస్తున్న నేటి సమాజంలో వృద్ధాప్యంలో సైతం నాకు నువ్వు, నీకు నేను అని ప్రేమతో తన భార్యకు తినిపిస్తున్న దృశ్యం దుబ్బాకలో ‘సాక్షి’ కంటపడింది. భార్యాభర్తల అనే పదానికి సరైన అర్థాన్ని చాటి చెబుతున్నారు.
తల్లిదండ్రుల ప్రేమకు దూరం
కోహెడరూరల్(హుస్నాబాద్): గతంలో తండ్రి.. రెండు రోజుల కిందట తల్లి మృతి చెందడంతో ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. ఈ విషాదకర ఘటన మండలంలోని శ్రీరాములపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన ఉత్కం బాలయ్య 13 ఏళ్ల కిందట అనారోగ్యంతో మృతి చెందాడు. భార్య ఉత్కం కవిత(40) కూలీ పని చేసుకుంటూ కూతురు వైష్ణవి(17), కుమారుడు రామ్‌చరణ్(15)ను పోషించుకుంటుంది. కవిత బుధవారం ఉపాధి హామీ కూలీకి వెళ్లి వడదెబ్బతో రాత్రి మృతి చెందింది. దీంతో ఇద్దరు పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారారు. అమ్మమ్మ కూడా వృద్ధురాలు కావడంతో పిల్లలు ఎలా బతకాలి దేవుడా అని ఏడుస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. ఆ చిన్నారులను ఆదుకోవాలని స్థానికులు, కుటుంబ సభ్యులు దాతలను కోరుతున్నారు. సాయం చేయాలకునే వారు ఫోన్‌పే నంబర్ 98489 24347 పోలు శ్రీనివాస్, గుగూల్ పే నంబర్ 96663 38616 బండిపెల్లి శ్రీకాంత్‌కు పంపగలరని కోరారు.

నిజమైన ప్రేమకు అర్థం