ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని.. | - | Sakshi
Sakshi News home page

ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని..

Oct 23 2024 7:35 AM | Updated on Oct 23 2024 9:17 AM

-

ఉరేసుకొని యువతి ఆత్మహత్య

జగదేవ్‌పూర్‌(గజ్వేల్‌): ఉరేసుకొని యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని అనంతసాగర్‌ గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన దాసరి కొండయ్య, మల్లమ్మకు ముగ్గురు కుమార్తెలు, కొడుకు ఉన్నారు. రెండో కూతురు అర్చన(18) గజ్వేల్‌ పట్టణంలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతుంది. గ్రామానికి చెందిన యువకుడిని ప్రేమించానని ఇటీవల ఇంట్లో చెప్పడంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో అర్చనకు పెళ్లి సంబంధం చూడగా సరేనని ఒప్పుకుంది. మంగళవారం ఉదయం తల్లిదండ్రులు పొలం పనికి వెళ్లాక ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ చంద్రమోహన్‌ తెలిపారు.

ఆర్థిక ఇబ్బందులతో కానిస్టేబుల్‌ భార్య
తూప్రాన్‌: ఆర్థిక ఇబ్బందులతో ఓ కానిస్టేబుల్‌ భార్య ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పట్టణ కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ శివానందం కథనం మేరకు.. మెదక్‌ ఎస్పీ కార్యాలయంలో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న ఏఆర్‌ కానిస్టేబుల్‌ గుజ్జ భూమేశ్‌ యాదవ్‌ పెద్ద భార్య కవిత(38) పట్టణంలోని నర్సాపూర్‌ చౌరస్తా సమీపంలోని ఓ కాలనీలో నివాసం ఉంటుంది. కానిస్టేబుల్‌ రెండో భార్యతో మరో చోట ఉంటున్నాడు. కుటుంబ తగాదాలతోపాటు ఆర్థిక ఇబ్బందుల కారణంగా కవిత ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తుంది. మృతురాలికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement