ప్రేమ పెళ్లితో.. పుట్టింటి వారికి చెప్పుకోలేక.. మౌనంతో చివరికీ.. | - | Sakshi
Sakshi News home page

ప్రేమ పెళ్లితో.. పుట్టింటి వారికి చెప్పుకోలేక.. మౌనంతో చివరికీ..

Aug 11 2023 7:42 AM | Updated on Aug 11 2023 11:28 AM

- - Sakshi

సంగారెడ్డి: వరకట్న వేధింపులకు ఓ వివాహిత బలైంది. ఈ సంఘటన మండల పరిధిలోని షాద్‌నగర్‌ (గట్‌పల్లి)లో గురువారం జరిగింది. ఎస్‌ఐ కోటేశ్వర్‌రావు కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన తెలుగానం శ్రీలత (21)ను ఏడాది క్రితం అదే గ్రామానికి చెందిన సిరూర్‌ రవి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొద్ది రోజులుగా శ్రీలతను పుట్టింటి నుంచి కట్నం తీసుకురావాలని భర్త రవితో పాటు అత్తమామలు వేధించడం మొదలుపెట్టారు.

వేరే కులానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకుందనే కోపంతో శ్రీలత తల్లిదండ్రులు ఇంటికి దూరం పెట్టారు. వేధింపులు ఎక్కువ కావడంతో పుట్టింటి వారికి చెప్పుకోలేక.. అత్తింటివారిని ఎదురించలేక ఈనెల 8న మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగు మందు తాగింది. హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం మరణించింది. మృతురాలి తండ్రి శంకరయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement