పాముకాటుతో విద్యార్థి మృతి | - | Sakshi
Sakshi News home page

పాముకాటుతో విద్యార్థి మృతి

Jun 27 2023 1:17 AM | Updated on Jun 27 2023 1:21 PM

- - Sakshi

పాముకాటుతో ఓ విద్యార్థి మృతి చెందాడు.

మెదక్: పాముకాటుతో ఓ విద్యార్థి మృతి చెందాడు. గజ్వేల్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మండల పరిధిలోని అనంతరావుపల్లి గ్రామానికి చెందిన గద్ద విజయ్‌–పద్మ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కొడుకు సంజయ్‌కుమార్‌(16) ఉన్నారు. సంజయ్‌ అల్వాల్‌లోని ఓ ప్రైవేట్‌ కాలేజీలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం రాత్రి పశువులకు మేత వేసి వస్తున్న క్రమంలో సంజయ్‌ కాలికి పాముకాటు వేసింది.

దీంతో అతను అపస్మారక స్థితికి చేరుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే గజ్వేల్‌ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారు జామున మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement