పౌష్టికాహారంతోనే ఆరోగ్యం

వలంటీర్లకు అవగాహన కల్పిస్తున్న దృశ్యం - Sakshi

గజ్వేల్‌రూరల్‌: ప్రతి రోజు భోజనంలో పౌష్టికాహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారని స్వస్తవ కేన్సర్‌ కేర్‌ బృందం సభ్యులు డాక్టర్‌ చతుర్వేది అన్నారు. గజ్వేల్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌–1 ఆఫీసర్‌ డాక్టర్‌ విజయభాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో బూరుగపల్లిలో చేపడుతున్న శిబిరంలో పాల్గొని మాట్లాడారు. కేన్సర్‌పై అవగాహన కలిగి ఉండాలని, కేన్సర్‌ బాధితులను గుర్తించే విధానం, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లకు వివరించారు. పొగాకు, మద్యపానం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో స్వస్తవ బృందం సభ్యులు సరిత, రాజశేఖర్‌, అధ్యాపకులు సాయికృష్ణ, వలంటీర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.

మద్దతు ధర అందించాలి

సిద్దిపేటజోన్‌: స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్స్‌ మేరకు పొద్దు తిరుగుడు పంటకు రూ.10,500 ధర ఇవ్వాలని అఖిల భారత కిసాన్‌ సభ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ విజో కృష్ణన్‌ అన్నారు. మంగళవారం పత్తి మార్కెట్‌ యార్డ్‌ను సందర్శించి, పొద్దు తిరుగుడు రైతులతో మాట్లాడారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు ఉత్పత్తులకు మార్కెట్‌లో మద్దతు ధర కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. ఆన్‌లైన్‌లో పంట వివరాలు నమోదు కాక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, కల్తీ విత్తనాలు, అడవి పందులు, కోతులుతో పంట దిగుబడి తగ్గిందని పేర్కొన్నారు. మార్కెట్‌కు వచ్చే రైతులకు ఉచిత భోజనం అందించాలని, పొద్దు తిరుగుడు పంటపై అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం సహాయ కార్యదర్శి శోభన్‌, తిరుపతి, యాదవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read latest Sangareddy News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top