
- విదేశీ విద్యకు నూతన గమ్యస్థానాలు
- సంప్రదాయ దేశాలకు పోటీగా కొత్త దేశాలు
- ఎంచుకుంటున్న భారతీయ విద్యార్థులు
విదేశాల్లో చదువుకోవాలని ఎవరికి ఉండదు? అక్కడే చదువుకుని, స్థిరపడాలన్నదీ కోట్లాదిమంది భారతీయుల కల. యూఎస్, కెనడా, యూకే, ఆస్ట్రేలియాలోని పేరొందిన యూనివర్సిటీలకు వెళ్లడం అనేది గతం. ఇప్పుడు ట్రెండ్ క్రమంగా మారుతోంది. సంప్రదాయ దేశాలకు బదులుగా భారతీయ విద్యార్థులు నూతన గమ్యస్థానాలను ఎంచుకుంటున్నారు.
ఎంబీబీఎస్ విద్య కోసం మధ్య ఆసియాలోని కిర్గిస్తాన్ ఇంజనీరింగ్ కోసం కంబోడియా, సప్లై చైన్ మేనేజ్‌మెంట్ చదివేందుకు మాల్టా, సాంస్కృతిక అధ్యయనాల కోసం ఉత్తర కొరియాకు చలో అంటున్నారు మన విద్యార్థులు. దేశీయంగా తీవ్రమైన పోటీ, అమెరికాలో రోజుకో రకంగా మారుతున్న విధానాలు; ఆస్ట్రేలియా, బ్రిటన్ వంటి దేశాల్లో వలసలపై పెరుగుతున్న వ్యతిరేకత, వీసాల లభ్యత కఠినతరం కావడం; పలు ఇతర దేశాల్లో విద్యా వ్యయాలు పెరుగుతుండడం.. వీటన్నింటి కారణంగా నూతన కోర్సుల కోసం కొత్త దేశాల బాట పడుతున్నారు.
సరికొత్త గమ్యస్థానాలు
మాల్టా, పోలాండ్, లాత్వియా, సైప్రస్ వంటిచిన్న యూరోపియన్ దేశాలు వివిధ ప్రోగ్రామ్స్‌లో భారతీయులు సహా విదేశీయులకు సులభంగా ప్రవేశం కల్పిస్తున్నాయి. అలా అక్కడ చదివిన గ్రాడ్యుయేట్లు ఉద్యోగాలు, అధునాతన డిగ్రీల కోసం ఫ్రాన్ ్స, జర్మనీ, యూకే, మధ్యప్రాచ్యాలకు వెళ్తున్నారు.
రొమేనియా, బల్గేరియా, హంగేరీలలోని భారతీయ ఇంజనీరింగ్ విద్యార్థులు చౌకైన స్థానిక ప్రోగ్రామ్స్‌లో చేరుతున్నారు. కానీ చాలామంది అధిక జీతాలు, అంతర్జాతీయ ఎక్స్‌పోజర్ కోసం జర్మనీ, నెదర్లాండ్స్, స్కాండినేవియాకు మారుతున్నారు.
అలాగే బంగ్లాదేశ్, ఉజ్బెకిస్తాన్‌లలో ఎంబీబీఎస్ చేసినవాళ్లు.. ఎక్కువ జీతాల కోసం మధ్య ప్రాచ్యదేశాలకు మరలుతున్నారు.
లైటింగ్, లైట్ డిజైన్
ఆర్కిటెక్చరల్, వేడుకల కోసం వేదికలు, నగరాల్లోని భవంతుల్లో లైటింగ్ కోసం కళాత్మకతను సాంకేతికతతో జోడించేలా శిక్షణ పొందడం.
కేంద్రాలు: మిలాన్ (ఇటలీ), బిల్‌బావ్ (స్పెయిన్ ), స్టాక్‌హోం (స్వీడన్ ).
మ్యూజిక్ థెరపీ
భావోద్వేగ,
ఆలోచన, శారీరక స్వస్థత కోసం
సంగీతాన్ని వైద్య
సాధనంగా
ఉపయోగించడం.
కేంద్రాలు: లిమెరిక్
(ఐర్లాండ్), నెదర్లాండ్స్.
క్రూజ్ లైన్ నిర్వహణ
ప్రపంచ క్రూజ్ పరిశ్రమ కోసం రూపొందించినప్రత్యేక ఆతిథ్య, కార్యకలాపాలకు సంబంధించిన విద్యా కార్యక్రమాలు. కేంద్రాలు: స్పెయిన్,స్విట్జర్లాండ్
మాలిక్యులర్ గ్యాస్ట్రోనమీ
నురగ (ఫోమ్), జెల్స్‌తదితరాలతో రుచులు, భోజన అనుభవాలను మార్చడానికి శాస్త్రాన్ని ఉపయోగించడం.
కేంద్రాలు:
స్పెయిన్, జపాన్,నెదర్లాండ్స్

గేమ్ డిజైనింగ్
గ్రీన్ సప్లై చైన్ పర్యావరణ అనుకూల, సమర్థవంతమైన, తక్కువ కర్బన ఉద్గారాలున్న రవాణా వ్యవస్థల రూపకల్పన
కేంద్రాలు: స్వీడన్,
డెన్మార్క్, నెదర్లాండ్స్
వీడియో గేమ్స్‌ను సృష్టించడం, అభివృద్ధి, తయారీ; కేంద్రాలు: ఫిన్లాండ్
హ్యుమానిటేరియన్ లాజిస్టిక్స్
విపత్తుల నుంచి ఉపశమనం, సహాయం, పంపిణీ, సంక్షోభ సమయంలో ప్రతిస్పందన కోసం సరఫరా వ్యవస్థల నిర్వహణ
కేంద్రాలు: ఫిన్లాండ్, బెల్జియం,
స్విట్జర్లాండ్, దక్షిణాఫ్రికా
సరఫరాను మించిన డిమాండ్
ఈ ఏడాది 22 లక్షలకు పైగా నీట్ అభ్యర్థులు.. భారత్‌లో కేవలం 1.18 లక్షల ఎంబీబీఎస్ సీట్ల కోసం పోటీ పడ్డారు.
అంటే అంతరం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకే విద్యార్థులు సంప్రదాయేతర దేశాలవైపు చూస్తున్నారు.
చౌకైన ఎంపిక
భారత్‌లోని ప్రైవేట్ కళాశాలలతో పోలిస్తే ‘చాలా తక్కువ ఖర్చు’తో.. ఎంబీబీఎస్
విద్యార్థులను తూర్పు యూరప్, మధ్య ఆసియా దేశాలు ఆకర్షిస్తున్నాయి. ఉజ్బెకిస్తాన్ ఒక్కటే 6వేలకుపైగా విద్యార్థులకు ఆతిథ్యం ఇస్తోంది. విజయవాడ, వరంగల్, తిరుపతి వంటి ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుంచి ఇప్పుడు విదేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య పెరుగుతోందని ఏజెన్సీలు చెబుతున్నాయి.
ఖర్చు ఎంతంటే?
భారత్ (ప్రైవేట్‌లో ఎంబీబీఎస్):
పూర్తి డిగ్రీకి రూ.1 కోటికిపైగా
ఉజ్బెకిస్తాన్/రష్యా/ఫిలిప్పీన్
పూర్తి ఎంబీబీఎస్‌కు రూ.15–35 లక్షలు
పోలండ్/చెక్ రిపబ్లిక్: ఏడాదికి రూ.9.5–17.5 లక్షలు (ట్యూషన్+జీవన వ్యయం)
జర్మనీ (ప్రభుత్వ విశ్వవిద్యాలయం):
సంవత్సరానికి రూ.30,000
-సాక్షి, స్పెషల్ డెస్క్